అమరేంద్ర బాహుబలి ఈతరం అమ్మయిలు కోరుకునే ఆదర్శ భర్త అని చెప్పడానికి కారణాలు ఇవ్వే…

బాహుబలి-2 చూసిన తరువాత కథ, VFX , భారీ సెట్లు, దిశ, ఆభరణాలు, అలంకరణలు ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకొని ఉంటారు. అమరేంద్ర బాహుబలి ఒక రాజుగానే కాదు ఒక మంచి భర్తగా కూడా అమ్మయిల మనసులు దోచుకున్నాడు. అమరేంద్ర బాహుబలి ఈతరం అమ్మయిలు కోరుకునే ఆదర్శ భర్త అని చెప్పడానికి కారణాలు ఏంటో చూడండి మరి..

# రాజమాత శివగామి యొక్క ముద్దు బిడ్డ అయినప్పటికీ దేవసేనకి అవసరం అయినప్పుడు తనతోనే ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయిలు తమ భర్తల నుండి కోరుకునేది కూడా ఇలాంటి సపోర్ట్.

# అంత పెద్ద దేశానికి యువరాజు అయినప్పటికీ దేవసేన తనని ఒక సాధారణ మనిషిలానే ఇష్టపడాలని అనుకున్నాడు. ఇలా సింపుల్ గా ఉండే వారు అంటే అమ్మాయిలకు అపారమైన అభిమానం.

# ఎప్పుడు దేవసేనకి సహాయంగా నిలిచాడు, పడవ ఎక్కుతున్నపుడు వారధి విరిగితే తానే వారధిగా మారి దేవేసేనతో పాటు అమ్మయిల మనసు కూడా దోచుకున్నాడు.

# దేవసేనని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినందుకు తాను రాజు అయ్యే అవకాశాన్ని కూడా బాహుబలి వదులుకున్నాడు. భార్య కంటే ఏది ఎక్కువ కాదు అని ఈ సన్నివేశంలో నిరూపించాడు బాహుబలి.

# రాజమాత శివగామి మరియు దేవసేన మధ్య జరిగిన గొడవలో బాహుబలి ఎప్పుడు తల దూరచలేదు. ఈ విషయాన్ని భర్తలు తప్పకుండ నేర్చుకోవాలి.

# కుమార వర్మకి దేవసేన అంటే ఇష్టం ఉంది అని తెలిసినప్పటికి బాహుబలి తనతో ఎలాంటి శత్రుత్వం పెట్టుకోలేదు.

# దేవసేనకి అవమానించిన వ్యక్తి ఎవ్వరు అని చెప్పి కూడా ఆలోచించకుండా అతని తల నరికాడు. భార్యని అవమానించిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాల్నో ఈ సన్నివేశం ద్వారా బాహుబలి తెలిపాడు.

Comments

comments

Share this post

scroll to top