సుకుమార్ కు ప్రేమతో 10 ప్రశ్నలు…చంటిగాడి ఈ ప్రశ్నల్లో సుకుమార్ ను మించిన లాజిక్కుంది.!?

హాయ్ సుకుమార్ గారు….మీరు లెక్కల్లో ఎంత ఘనాపాటో…నాన్నకు ప్రేమతో టైటిల్స్ లోనే తెలిసిపోయింది. కానీ సినిమాను అర్ధం చేసుకోవడమే త్రికోణమితి చాప్టర్ లా చాలా కష్టంగా ఉంది. కొందరేమో ఏం సినిమా తీసావ్ బాస్, కూసింత కూడా బుర్రకెక్కలేదు అని తిట్టుకుంటున్నారు, మరికొందరేమో సుక్కు నువ్వు హాలివుడ్ లో ట్రై చేయ్..నీ సినిమాల్లో అంత డెప్త్ ఉంటుందని తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నాకైతే ఓ 10 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుంది…జరంత తీరిక చేసుకొని వాటికి సమాధానం చెబుతారని ఆశిస్తూ నా  డౌట్లను మీముందుంచుతున్నాను…క్లారిఫై కరో యార్.!

1) ఎట్టెట్టా..? షూ ను 45 డిగ్రీల యాంగిల్ లో తిప్పితే .. హీరో చేతికి మట్టి అంటకుండా.. పెద్ద పెద్ద విలన్లు తమను తామే కొట్టుకుంటారా…? మరీనూ….. ఓ సివిల్ ఇంజనీర్ కొలతలు కొలిచి ఇల్లు కట్టినట్టు లేదు..?

NTR

2) ఒకడు తన గన్ తో ఇంకొకతనిని చంపితే..ఇంకొకడు ఇంకొడిని చంపితే…మొత్తం 100 మంది ఉంటే చివరగా ఆ గన్ ఎవరి చేతిలో ఉంటుంది… అంటూ అంతగా గుర్తు లేదు కానీ ఇటువంటి ఓ ప్రశ్న జగపతి బాబు వేస్తే చటుక్కున సమాధానం చెబుతాడు రాజేంద్రప్రసాద్…ఇదెలాగండీ..? చెబుతున్నప్పుడు ఈ ప్రశ్నే అర్థం కాలేదు..అలాంటిది చైనా సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్ గా రాజేంద్రప్రసాద్ ఆన్సర్ ఎలా చెప్పారు..? అసలు ఈ ప్రశ్నలో ఉన్న లాజిక్ ఏంటి..? సుక్కూ సార్.?

RJENDRA

3) అంత తెలివిగల జగపతి బాబు పెయింటింగ్ లో ఉన్న చిన్న కెమెరాను గుర్తుపట్టలేక పోవడం నిజంగా విడ్డూరమనిపించలేదా.. ? మీకు?

JAGU

4) జైల్లో తల్లి చూపించిన ఫోటో చూసిందాక హీరోయిన్ కు గతం గుర్తుకురాకపోవడం……అభిజ్ఞాన శాకుంతలం నాటకం చూస్తున్నట్టు లేదు..?

2

5)  ప్రపంచం లోని ఏ బ్యాంక్ అయినా ఒక్క అయిదు సెకన్లలో 35 వేల కోట్లు ట్రాన్స్ ఫర్ చేస్తుందా? నాకైతే 50 వేల లిమిట్ మరీ.!

6) వాచ్…. కోసం హీరోయిన్ ను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని హీరో భలేగా కనుక్కుంటాడు కదా.. హౌ…? హౌ…? ఇది లాజిక్కా…? మ్యాజిక్కా..?
7) నాన్నకు ప్రేమతో సినిమాలోని హీరో… జులాయిలో త్రివిక్రమ్ సృష్టించిన హీరోకు అప్ గ్రేడ్ వర్షనా…?

Allu-Arjuns-JULAI-Movie-First-Look-001

8)తేలు కాటు విరుగుడు మందుకి…. అన్నయ్య కార్ నెంబర్ కి…ఎలా అండి సింక్ చేశారు? కాఫీ కప్ టర్న్ కు, హీరోను హీరోయిన్ కిస్ చేసే సీన్ కు అబ్బో   ఆ లింకేంటి బాబు..?

9).అరుదైన సీతాకోక చిలుకలు అక్కడే ఉంటాయని ఓ ప్రాజెక్ట్ ను ఆపాలని ట్రై చేసే జగపతి బాబు ఆఫీస్ దగ్గర కూడా చాలా సార్లు అదే సీతాకోక చిలుక కనిపిస్తుంది. అరుదైనదైతే…. ఇక్కడెలా ఉంటుంది..? హౌ?

Captur1

10).డాక్టర్లు సారీ అన్నాక… కూడా దిబ్ దిబ్ దబ్ అనే ఓ మ్యూజిక్ సైన్ తో రాజేంద్రప్రసాద్ బతకడం లాజిక్కా..? కామెడీనా… మన పాత సినిమాల ఫార్మాటా..?

NNAKU 3

by ;

మీ సోషల్ మీడియా చంటిగాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top