బాహుబలి పార్ట్ 1లోసమాధానం దొరకని 10 ప్రశ్నలు?

ఓ ప్రేక్షకుడు బాహుబలి విడుదల మొదటి రోజు  ఈలలు వేసుకుంటూ సినిమా చూసాడు, అహా ఏమి సినిమా అంటూ థియేటర్ నుండి బయటకు వచ్చేసాడు.  బయటికైతే వచ్చేశాడు, కానీ అతని బుర్రలోని పది ప్రశ్నలు అతనిని  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్, ఎంత వెతికినా సమాధానం దొరకడం లేదు, అంత తేలిగ్గా ఆన్సర్ దొరకడానికి ఆయన రాజమౌళి కాదు కదా….!   తెర మీద బాహబలి సినిమానైతే చూశాడు కానీ తర్వాత నుండి అతనిని ఆ 10 ప్రశ్నలు ఆగమాగం చేస్తున్నాయి . అసలు  పార్ట్ 2 కొరకు ప్రేక్షకులను అలర్ట్ చేయడానికే  బాహుబలి  పార్ట్ 1 లో   జక్కన్న ఆ 10 ప్రశ్నలు అలా వదిలేశాడేమోనని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడాభిమాని.

BAHUBALI IST DAY COLLECTIONS

మీకేమైనా అన్సర్ దొరికితే చెప్పండి, అంతే కాని పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి అని మాత్రం సెలవివ్వకండి!! ఎందుకంటే  పార్ట్ 2 ఫస్ట్ డే రోజు ఎలాగైనా ఫస్ట్ టికెట్టు కొని అతనే చూస్తాడులేండి!!

 1. అసలు దేవసేన ఎవరు?
 2. దేవసేనకు అవంతికకు సంబంధం ఏంటీ?
 3.  ఆ గూడెం వాసులు షార్ట్ కట్ గా కాగడాలు పట్టుకొచ్చిన ప్రాంతానికి, ప్రభాస్ గుట్టలను,కొండలను పాకుకుంటూ రావాల్సిన అవసరం ఏంటి?
 4.  అసలు బాహుబలి ఎవరి కొడుకు?
 5. రానా …రమ్యకృష్ణ, నాజర్ ల కొడుకేనా? కాదా?
 6.  కట్టప్ప బాహుబలిని ఎందుకు  చంపాడు. చంపినోడు సంపినట్టు ఉండక ఏడ్చుడెందుకు, దేవసేనను విడిపిస్తా అనుడెందుకు? 
 7. బాహుబలి తిరిగొస్తాడని దేవసేనకు ఎలా  తెలుసు?
 8.  బాహుబలిని చంపిన కట్టప్పపై దేవసేనకు కోపం ఎందుకు లేదు.
 9. రాజమాత రమ్యకృష్ణ పారిపోవాల్సిన అవసరం ఎంటి? 
 10.  శివుడిని  పెంచిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటీ. అవంతిక తో శివుడి లవ్ స్టోరికి  ఏమయ్యింది.

ఈ 10 ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కొరకే బాహుబలి పార్ట్ 2 ఉన్నది, అంటే పార్ట్ 1 కేవలం డెమో నే అన్న మాట! అసలు కథంతా పార్ట్ 2 లోనే పెట్టేశారన్న మాట. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు  నెట్టింట్లో  వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బాహుబలి ది బిగినింగ్ రికార్డులను షేక్ చేస్తుంటే బాహుబలి కన్ క్లూజన్ కొరకు ఇప్పడే …. సొల్యూషన్ వెతికే పనిలో పడ్డారు మన అభిమానులు. ఇప్పుడైతే ఈ టనాటన్ టెన్ క్వశ్చన్స్ హల్ చల్ చేస్తున్నాయ్ మరి!

CLICK: బాహుబలి పార్ట్ -2  స్టార్ట్ చేశారు.

Comments

comments

Share this post

0 Replies to “బాహుబలి పార్ట్ 1లోసమాధానం దొరకని 10 ప్రశ్నలు?”

 1. Harinath Jarugula says:

  1. Devasena, amarendra bahubali bharya
  2. Avanthika Devasena menakodalu
  3. Prabhas ki ala oka dari vundani evaru cheppaledu.
  4. bahubali evari kodukanedi already movie lo chepparu
  5. rana ramyakrishna nasser lo kodukani already movie lo chepparu
  6. kattappa bahubalini champadaniki kaaranam bahusha raana raju ayipoyi, raju aagna valla kavochu(This will be there in 2nd part)
  7. Bahubali tirigosthadani anukodam just thana feeling(cinematic liberty though)
  8. Bahubali ni champina karanam devasena ki kachitam ga telisi untundi
  9. bahubali ni champina tarvata thana koduku ni kooda champabothe ramya krishna kapadadaniki paripothundi
  10. idi definite ga 2nd part lo ne choodali.

  1. Raghu Ram says:

   might be katappa kuthuru devasena….!

   so raana katapa ki proposal pedathadu ne kuthurini peli cheskuntanu ani anduke bahubali ni champesthadu kani apatike prabhas and anushka may be fall in love….if u notice at last shivudu will call katapa as” tatha” if u watch next time u can check…! so katapa daughter is devasena and tamanah is just a warrior princess

   1. Harinath Jarugula says:

    kattappa ni pedda prabhas chinna ga unnapde maama ani piliusthadu, anduvalla thatha ani pilusthadu. more over movie starting lo map choopisthadu andulo kunthala rajyam ani okati choopisthadu, anushka aa desha yuvarani ayyuntadi. and the promos introduced anushka also shows the same.

 2. Kait's Sai Anand says:

  1. Wait for part 2
  2. Sugar vundha niku ?
  3. Shortcut vundhani shividu (Prabas) ki telvadu, coz adi chinnapudu jarigina scene
  4. Part 1 malli chudu
  5.
  6. Kattapa Raja Simhasanam ki baanisa, Rana was king, Prabas choose Devasena and Rajasimhasam vodulkutadu- Again wait for Part-II
  7. Adi nammakam beyyy, Thalli manasu ani antha clear ga vundhi kada bey
  8. Yere editolu purtiga chupichevarku aagavetraa
  9. Prabas Anushka ni kaapadalani try chesinanduku
  10. Ni bondha ra ni bondhaaa

 3. Vijay Shyam Reddy says:

  5. rana ramyakrishna nasser lo kodukani already movie lo chepparu is not correct may be nasar have to wifes

  1. Sravann Bujji says:

   no pedha raju chanipoyadu an i kooda chepparu aatharavatha rani deliver ayyin chanipothundhi kabatti amma nanna idharu chanipoyinatte

 4. Vinay Kumar Muktha says:

  rana koduku adavisheshu ithe pellam evaru

 5. Preethi Prasadi says:

  Pls wait for part 2

 6. vikash says:

  3.because shivudu dont know that shortcut, that was closed when his childhood only right..
  4.bahubali is son of najar’s brother.
  5.yes rana son of them

 7. Ram Babu says:

  Yet the article left the much bigger questions!
  – Why does the man steals the army secrets of Mahishmati
  – Why does he even send it to Kalakeyas
  No jstification provided for the above 2 in the movie.

 8. vanguri bharath says:

  anushka-devasena-devakunthala raajyam…..

  and the story is:

  నెటీజన్ల ప్రకారం బాహుబలి పార్ట్-2 స్టోరి: అమరేంద్ర బాహుబలి (పెద్ద ప్రభాస్), బళ్లాలదేవ (రాణా) ఇద్దరూ దేవసేన(అనుష్క)ను ఇష్ట పడతారు. దేవసేన (అనుష్క) మాత్రం బాహుబలిని ఇష్ట పడుతుంది. దీంతో రాజ్యం కావాలా? ప్రేమ కావాలా? అని బాహుబలిని అడిగితే ‘ప్రేమే’ కావాలనుకుని దేవసేన (అనుష్క)తో కలసి రాజ్యం విడిచి బాహుబలి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి దేవసేన (అనుష్క), బాహుబలి (పెద్ద ప్రభాస్) ప్రేమ, పెళ్లి, వాళ్ళ కాపురం, దేవసేన (అనుష్క) గర్భవతి కావడం జరుగుతుంది. అదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బళ్లాల దేవ (రాణా) ప్రజల్ని హింసలు పెడుతూ వుంటాడు. ప్రజల్లోనూ అతడి పాలన మీద తీవ్ర అసంతృప్తి రగులుతుంది. అదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు (చరణ్ దీప్) మహిష్మతి రాజ్యం మీద దండెత్తుతాడు. అప్పుడు మాహిష్మతి ఓడిపోయే స్థితికి వస్తుంది. విషయం తెలుసుకున్న ‘బాహుబలి’ యుద్దంలో పాల్గొని తమ రాజ్యాన్ని కాపాడుతాడు. అటు బాహుబలికి కట్టప్ప చేత వెన్నుపోటు పొడిచేలా బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా) కలసి కుట్ర పన్నుతారు. బాహుబలిని చంపేస్తారు. అటు దేవసేన (అనుష్క) మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చంపేందుకు బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా)ప్రయత్నిస్తారు. శివగామి (రమ్యకృష్ణ) వాళ్ల ప్రయత్నానికి అడ్డుపడి, వాళ్ళతో పోరాడుతుంది. ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకోని ఆ బిడ్డ ‘శివుడు'(చిన్న ప్రభాస్)ని గూడెం వాసులకు దొరికేలా చేస్తుంది. ఇక్కడి వరకు జరిగిన కథతో సినిమా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది. గతాన్ని తెలుసుకున్న శివుడు తన బలగం అయిన కట్టప్ప సైన్యంతో పాటు , అవంతిక (తమన్నా) సైన్యం, అస్లంఖాన్ (సుదీప్ ) సహకారంతో బళ్ళాల దేవ (రాణా) మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో బళ్ళాలదేవ (రాణా) ఓడిపోతాడు. అతడ్ని దేవసేన (అనుష్క) పేర్చిన పుల్లల చితి మీద బ్రతికి వుండగానే కాలుస్తారు. దీంతో బాహుబలి రెండవ భాగానికి శుభం కార్డు పడుతుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top