ఎదుటివారు చెప్పేది అబద్దమో..? నిజమో..? తెలుసుకోవడం చాలా సింపుల్..! 10 ట్రిక్స్ ఇవే..!

ఎదుటి వ్య‌క్తి మ‌న‌స్సులో ఏముందో తెలుసుకోవ‌డం నిజంగా ఎవ‌రికీ సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు ? మ‌న గురించి ఏమ‌నుకుంటున్నాడు ? వ‌ంటి విష‌యాల‌ను ఎవ‌రూ తెలుసుకోలేరు. అయితే ఈ విష‌యం ఏమో గానీ మ‌న ఎదుట ఉన్న వ్య‌క్తులు అబ‌ద్ధం చెబుతున్నారా ? నిజం చెబుతున్నారా ? అనే విష‌యాన్ని మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అందుకు కింద చెప్పిన కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో అవ‌తలి వారు చెబుతుంది నిజ‌మా, అబ‌ద్ద‌మా అనే విష‌యం మ‌నకు ఇట్టే తెలిసిపోతుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో చూద్దామా..!

1. ఎదుటి వారు అబ‌ద్దం చెబుతున్నారా ? అనే సందేహం గ‌న‌క మీకు క‌లిగితే అప్పుడు మీరు వారి బాడీని ఒక‌సారి ప‌రిశీలించండి. ముఖ్యంగా చేతుల‌ను. ఒక వేళ వారు గ‌న‌క అబ‌ద్దం చెబుతున్న‌ట్ట‌యితే వారి చేతుల‌ను మ‌న‌కు క‌నబ‌డ‌నీయ‌రు. వెనుక దాచేస్తారు. లేదంటే చేతుల‌ను జేబుల్లో పెట్టుకుంటారు. రెండు చేతుల‌ను క‌లిపి న‌లుపుతుంటారు. వారు స్ట్రెయిట్‌గా మ‌న‌ల్ని చూడలేరు. కాళ్ల‌ను నేల‌కు కొడుతుంటారు. పెదాల‌ను కొరుకుతుంటారు.

2. అబద్దం చెప్పే వ్య‌క్త‌లు శ్వాస హెవీగా ఉంటుంది. గొంతు స‌న్న‌గా వ‌స్తుంది. ఎందుకంటే వారు అబ‌ద్దం చెబుతున్నామ‌ని నర్వ‌స్ ఫీల‌వుతారు గ‌న‌క‌. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంటారు.

3. సౌక‌ర్య‌వంతంగా కూర్చోలేరు, నిల‌బ‌డ‌లేరు. ఇబ్బంది ఫీల‌వుతుంటారు. చేతుల‌ను క‌ట్టుకుని ఉంటారు. భుజాలు వ‌ణుకుతుంటాయి. శ‌రీరం బిగుసుకుపోయిన‌ట్టుగా ఉంటారు.

4. ఎప్పుడూ అబ‌ద్దాలు చెప్పే వారు, అబ‌ద్దాలు చెప్ప‌డంలో దిట్ట‌లైన వారికి కూడా అబ‌ద్దాలు చెప్పే స‌మ‌యంలో విప‌రీత‌మైన చెమ‌ట వ‌స్తుంటుంది. ఇది చాలా సాధార‌ణంగా ఎవ‌రిలోనైనా జ‌రుగుతుంది.

5. అబ‌ద్దాలు ఆడే వారు ఎదుటి వ్య‌క్తుల క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి నేరుగా చూడ‌లేరు. ఒక వేళ చూసినా వెంట‌నే చూపు తిప్పుకుంటారు. ఇక కొన్ని సార్లు అబ‌ద్దాలు ఆడే వారు నేరుగా అదే ప‌నిగా ఎదుటి వారి క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి కూడా చూస్తారు.

6. అబ‌ద్దాలు చెప్పేవారు అస‌లు విష‌యం విడిచిపెట్టి వేరే టాపిక్‌కు చేంజ్ అవుతారు. మాట మారుస్తుంటారు.

7. అబ‌ద్దాలు ఆడే వారు మెడ‌, వెంట్రుక‌లు, ముక్కు వంటి భాగాల‌ను ప‌దే ప‌దే ట‌చ్ చేస్తారు. ఇక నోటికి చేతిని అడ్డుపెట్టుకుంటుంటారు.

8. అబ‌ద్దాలు ఆడే వారు కొన్ని సార్లు ఎదుటి వ్య‌క్తులే అబ‌ద్దం చెబుతున్నార‌ని బుకాయిస్తారు. మాట మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు. దీంతోపాటు నీకెందుకు చెప్పాలి ? అది అంత ముఖ్యం కాదు ? త‌ర‌హా ప్ర‌శ్న‌లు వేస్తారు.

9. అబ‌ద్దాలు చెప్పే వారు స‌డెన్‌గా పెద్ద గొంతుతో మాట్లాడుతుంటారు. వేగంగా మాట్లాడుతారు. అలాంటి స‌మ‌యంలో త‌ప్పులు చేస్తారు.

10. అబ‌ద్దాలు ఆడేవారు అంత త్వ‌ర‌గా స‌మాధానం ఇవ్వ‌రు. ఆలోచించుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది క‌నుక కొంత నెమ్మ‌దిగా స‌మాధానం చెబుతారు.

Comments

comments

Share this post

scroll to top