ఈ 10 మంది హీరోయిన్లు వాడే “పెర్‌ఫ్యూమ్‌లు” ఏ కంపనీవో తెలుసా..? వాటి ధరలు ఎంత అంటే..!

శరీరం నుంచి చెమట, దుర్వాసన రాకుండా ఉండేందుకు గాను చాలా మంది పర్‌ఫ్యూమ్‌ వాడుతారు కదా. ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తమకిష్టమైన పెర్‌ఫ్యూమ్‌ను కొని ఉపయోగిస్తారు. అయితే మన సంగతి సరే. ఇంతకీ సెలబ్రిటీల మాటేమిటి..? వారు ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లను వాడుతారు..? అదేనండీ.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు కదా.. వారే… ఆ నటీమణులు ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌ వాడుతారు, ఆ పెర్‌ఫ్యూమ్‌ ఖరీదు ఎంత ఉంటుంది, దాని బ్రాండ్‌ ఏమిటి ? అనే వివరాలు తెలుసా ? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. దీపికా పదుకునె
Hugo Boss, Ralph Lauren, Estee Lauder తదితర కంపెనీలకు చెందిన పర్‌ఫ్యూమ్‌లను ఈమె వాడుతుంది. వీటి ఖరీదు 100 ఎంఎల్‌ కు రూ.3,870 వరకు ఉంటుంది.

2. ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌
ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ Clinique Happy. దీని ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.4వేల వరకు ఉంటుంది.

3. శిల్పాశెట్టి
ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.1500 వరకు ఉంటుంది. Green tea కంపెనీకి చెందిన పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది.

4. సోనమ్‌ కపూర్‌
Michael Kors అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.6500 వరకు ఉంటుంది.

5. కరీనాకపూర్‌
Jean Paul Gaultier’s Classique అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ధర రూ.5,204 వరకు ఉంటుంది.

6. కంగనా రనౌత్‌
ఈమె Chanel No. 5. కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.10వేల వరకు ఉంటుంది. అది కూడా కేవలం 100 ఎంఎల్‌ బాటిల్‌కే కావడం విశేషం.

7. సుష్మితా సేన్‌
ఈమె రూ.3300 విలువ చేసే Red Door by Elizabeth Arden అనే కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది.

8. ప్రియాంక చోప్రా
ఈమె Ralph Lauren ‘Romance అనే పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.5వేలు.

9. కత్రినా కైఫ్‌
Gucci’s Rush అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ధర రూ.5వేలు.

10. ఆలియాభట్‌
Armani Code పర్‌ఫ్యూమ్‌ను ఆలియా భట్‌ వాడుతుంది. దీని ధర 100 ఎంఎల్‌కు రూ.5వేలు.

Comments

comments

Share this post

scroll to top