ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..! 8 వ ది చూస్తే షాక్ అవుతారు..!

నిజ‌మే మ‌రి. ఆహార ప‌దార్థాలు ఏవైనా కొంద‌రికి కొన్ని న‌చ్చుతాయి, ఇంకొంద‌రికి ఇంకొన్ని న‌చ్చుతాయి. వాటినే వారు ఇష్టంగా తింటారు. అన్నింటినీ తిన‌రు క‌దా. స‌రే… ఆహార ప‌దార్థాల విషయంలో ఎవ‌రి టేస్ట్ ఎలా ఉన్నా… కొన్ని ర‌కాల ఆహార పదార్థాల‌ను చూస్తే మాత్రం దాదాపుగా అంద‌రి నోళ్లు ఊర‌తాయి. స‌హ‌జంగానే వాటిని తినాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో ఆక‌లి కాక‌పోయినా స‌రే ఆ ఆహారాలను చూడ‌గానే ఆక‌లి క‌లుగుతుంది. దీంతో వాటిని అంద‌రూ ఎక్కువ‌గా తినేస్తారు. అలా తిన్నా కూడా ఆక‌లి ఆగ‌దు. ఇంకా అవుతూనే ఉంటుంది. మ‌రి అలాంటి నోరూరించే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. సిరియ‌ల్స్
వీటిని కొన్ని తిన్నప్ప‌టికీ పొట్ట నిండిన భావ‌న క‌ల‌గ‌దు. ఇంకా తినాల‌నే అనిపిస్తుంది. బాగా ఆక‌లి కూడా వేస్తుంది. అందుకు కార‌ణం వీటిలో అధికంగా ఉండే చ‌క్కెర ప‌దార్థ‌మే. వీటిలో ఫైబ‌ర్ అస‌లే ఉండ‌దు. అందుక‌నే వీటిని ఎంత తిన్నా తిన్న‌ట్టు ఉండ‌దు. ఆక‌లి వేస్తుంది.

2. వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్ తిన‌గానే ఎవ‌రికైనా ఆక‌లి వేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ప‌దార్థాలు ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. ఫ‌లితంగా ఆక‌లి పెరుగుతుంది. ఎక్కువ‌గా తింటారు.

3. చిప్స్‌, పాప్ కార్న్
సినిమాలు చూస్తున్న‌ప్పుడు, టైం పాస్ చేద్దామ‌ని చాలా మంది పాప్ కార్న్, చిప్స్ తిన‌డం స‌హ‌జ‌మే. అయితే వీటిలో ఉన్న అధిక ఉప్పు కార‌ణంగా ఒంట్లో ఉన్న నీరు అంతా పోయి శ‌రీరం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో దాహంతోపాటు ఆక‌లి కూడా వేస్తుంది. క‌నుక వీటిని కూడా ఎంత తిన్న‌ప్ప‌టికీ క‌డుపు నిండ‌దు. కాబ‌ట్టి ఆక‌లి వేస్తుంది.

4. ప్యాకేజ్ జ్యూస్
వీటిల్లో అధిక మొత్తంలో చ‌క్కెర ఉంటుంది. క‌నుక వీటిని తాగిన‌ప్పుడు ర‌క్తంలో గ్లూకోజ్ లెవ‌ల్స్ బాగా పెరుగుతాయి. ఫ‌లితంగా అధిక దాహంతోపాటు ఆక‌లి కూడా వేస్తుంది.

5. ఫాస్ట్ ఫుడ్
దాదాపుగా అన్ని ర‌కాల ఫాస్ట్ ఫుడ్స్ ల‌లో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మన శ‌రీరంలోకి చేర‌గానే న్యూరో ట్రాన్స్ మీట‌ర్ల‌ను విడుద‌ల చేస్తుంది. ఫ‌లితంగా అవి మ‌నం ఎక్కువ‌గా ఆహారం తినేలా చేస్తాయి. అంత త్వ‌ర‌గా కడుపు నిండిన ఫీలింగ్‌ను అవి క‌లిగించ‌వు. దీంతో బాగా ఎక్కువ‌గా తినేస్తాం.

6. చ్యూయింగ్ గ‌మ్
చ్యూయింగ్ గ‌మ్ న‌మిలేట‌ప్పుడు మ‌న జీర్ణాశ‌యంలోకి ప‌లు ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయి. అవి మ‌న‌కు ఆక‌లి అయ్యేలా చేస్తాయి.

7. డైట్ డ్రింక్
వీటిలో కూడా చ‌క్కెర అధికంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ డ్రింక్స్‌ను తాగిన‌ప్పుడు ఒంట్లోకి చ‌క్కెర ఎక్కువ‌గా చేరి ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఆక‌లి అధికంగా అవుతుంది.

8. ఫ్రోజెన్ యోగ‌ర్ట్
వీటిల్లో ఉండే అధిక చ‌క్కెర వ‌ల్ల ఇది ర‌క్తంలో చేరాక గ్లూకోజ్‌గా మారుతుంది. ఫ‌లితంగా పెద్ద ఎత్తున గ్లూకోజ్ ర‌క్తంలో ఉండ‌డం వ‌ల్ల ఆక‌లి బాగా అవుతుంది.

9. యాపిల్
యాపిల్‌లో 95 శాతం ఉన్న‌వి కార్బొహైడ్రేట్లే. దీంతో యాపిల్స్‌ను తిన్న‌ప్పుడు మ‌న‌కు క‌డుపు నిండిన భావ‌న క‌ల‌గదు. పైగా ఆక‌లి బాగా అవుతుంది.

10. కెచ‌ప్
కెచ‌ప్‌ల‌లో హై ఫ్ర‌క్టోస్ కార్న్ సిర‌ప్ ఉంటుంది. ఇది ఆక‌లిని నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్‌పై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక కెచ‌ప్‌ను తిన్న‌ప్పుడు లెప్టిన్ ప్ర‌భావిత‌మై మ‌న‌కు ఆక‌లి ఎక్కువ‌గా అయ్యేలా చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top