కార్ తాళాలు పోయాయా.? అయితే ఈ 10 సింపుల్ ట్రిక్స్ కార్ లాక్ ఓపెన్ చేయొచ్చు..! 3 వ ది హైలైట్!

నిత్యం వాహనాలను వాడేవారు ఎవరైనా వాటి కీస్‌ను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. ఎక్కడైనా అవి పోతే ఆ తరువాత కష్టాలు ఉంటాయి చూడండి.. అప్పుడు కలిగే ఇబ్బందిని మాటల్లో చెప్పలేం. ఇక ముఖ్యంగా కారు యజమానులు అయితే ఒక్కోసారి తాళాలను వాటిలోనే వదులుతారు. ఈ క్రమంలో కార్‌ అనుకోకుండా లాక్‌ అయితే ఆ తరువాత దాన్ని లాక్‌ తీయడం కష్టతరమవుతుంది. తాళాలు పోయినా, ఇలా కారులో తాళాలు మరిచినా.. ఎలాగైనా ఇబ్బందే. మరి అలాంటి సందర్భాల్లో కార్‌ లాక్‌ ఎలా తీయవచ్చో తెలుసా..? అందుకు కింద చెప్పిన ఈ 10 టిప్స్‌ పనికొస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామా..!

1. ఒక టెన్నిస్‌ బాల్‌ను తీసుకుని దానికి రంధ్రం చేయండి. ఆ రంధ్రాన్ని కారు కీ హోల్‌పై పెట్టండి అనంతరం టెన్నిస్‌ బాల్‌ను పుష్‌ చేయండి. అందులో ఉండే గాలి లాక్‌ను ఓపెన్‌ చేస్తుంది.

 

2. చిత్రంలో చూపిన విధంగా షూ లేస్‌తో ఒక లూప్‌ను తయారు చేసి దాన్ని కారు లోపలికి చొప్పించాలి. అనంతరం లూప్‌ను పైకి లాగితే కార్‌ డోర్‌ లాక్‌ ఓపెన్‌ అవుతుంది.

3. కోటులను తగిలించే హాంగర్‌తో కూడా కార్‌ డోర్‌ లాక్‌ ఓపెన్‌ చేయవచ్చు. పైన రెండవ టిప్‌లో చెప్పిన విధంగానే కోటు హాంగర్‌ను వంచి కారు లోపలికి చొప్పించి కారు డోర్‌ లాక్‌ను తీయాల్సి ఉంటుంది. దీంతో కార్‌ అన్‌లాక్‌ అవుతుంది.

4. రాడ్‌ లేదా స్క్రూ డ్రైవర్‌ను డోర్‌ లోపలికి చొప్పించి కూడా లాక్‌ తెరవచ్చు. కాకపోతే ఇలా చేస్తే కార్‌ డోర్‌ బయట, లోపల గీతలు పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ టిప్‌ పాటించేముందు ఒకసారి ఆలోచించుకోండి.

5. స్పాటులాను కార్‌ డోర్‌ లోపలికి చొప్పించి కూడా లీవర్‌ను పైకి లాగి లాక్‌ తెరవచ్చు.

6. ఇన్‌ఫ్లాటబుల్‌ వెడ్జ్‌ అని పిలవబడే పరికరం మనకు అందుబాటులో ఉంటుంది. దీంతో లాక్‌ను సులభంగా తెరవచ్చు. దీనికి ఒక వైపు ఉండే బ్యాగ్‌లో ఎయిర్‌ నిండుతుంది. దాంతో లాక్‌ లీవర్‌ను సులభంగా ఓపెన్‌ చేయవచ్చు.

7. రెండో టిప్‌లో షూ లేస్‌ ద్వారా ఎలాగైతే కార్‌ డోర్ తెరవచ్చు అని చెప్పామో, అలాగే ప్లాస్టిక్‌ తాడుతో కూడా లాక్‌ ఓపెన్‌ చేయవచ్చు.

8. పైన చెప్పిన మెథడ్స్‌ ఏవీ పనిచేయకపోతే ఎక్స్‌పర్ట్‌ను పిలవడం బెటర్‌.

9. లాక్‌ పికింగ్‌ టూల్స్‌ ద్వారా కూడా కార్‌ డోర్‌ లాక్‌ తెరవచ్చు.

10. స్వర్ణకారుల వద్ద ఉండే టూల్స్‌ సహాయంతో కూడా కార్‌ లాక్‌ తీయవచ్చు.

ఇక చివరగా మీరు కార్ లాక్ చేసేముందు డోర్ దగ్గర రూపాయి కాయిన్ పెట్టుందేమో గమనించండి. ఎందుకంటే కార్ లాక్ అవ్వకుండా ఉండటానికి కొంతమంది దొంగలు అలా పెడుతుంటారు.

image source: brightside

Comments

comments

Share this post

scroll to top