ఒక భర్త నుండి ఇంకో భర్త దగ్గరకి వెళ్లేముందు “ద్రౌపది” కన్యత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేసేదో తెలుసా.?

హిందూ పురాణాల్లో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మనం చిన్నప్పటి నుంచి మహాభారతాన్ని అనేక సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. మహాభారత గాథకు చెందిన పుస్తకాలను చదువుతున్నాం. టీవీల్లో సీరియల్స్‌, థియేటర్స్‌లో సినిమాలు చూస్తున్నాం. అయితే ఎన్ని చూసినా, చదివినా మనకు ఇంకా మహాభారతం గురించి తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక విషయం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అది కూడా ద్రౌపదికి సంబంధించినది. ఆమెకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. పురాణ కాలంలో ఒక స్త్రీ తనకు అన్యాయం జరిగితే నోరెత్తి అడిగేది కాదు. మౌనంగా దాన్ని భరించేది. కానీ ద్రౌపది మాత్రం అలా కాదు. తనకు అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆమె గొంతెత్తి తన వాణిని వినిపించింది. ఎవరికీ, ఎప్పుడూ, ఎక్కడా ఆమె భయపడలేదు. ఇది ఆమెలో ఉన్న ధైర్య గుణానికి నిదర్శనం.

2. ద్రౌపదికి యజ్ఞసేని అనే మరో పేరు ఉంది. అది ఎందుకు వచ్చిందంటే.. ఆమె అందరూ జన్మించినట్టుగా తల్లి కడుపులో పెరిగి జన్మించలేదు. ఆమె యుక్త వయస్సులో ఉన్న కన్యగా నేరుగా అగ్ని నుంచి జన్మించింది. కనుకనే ఆమెను యజ్ఞసేని అని పిలుస్తారు.

3. మహా కలి తన తరువాతి జన్మలో ద్రౌపదిగా జన్మించాడని దక్షిణ భారత దేశంలో చాలా మంది నమ్ముతారు. అలా జన్మించి ద్రౌపది కౌరవులను నాశనం చేయడానికి, శ్రీకృష్ణునికి సహాయం చేయడానికే వచ్చిందని చెబుతారు.

4. ఒక రోజు ధర్మరాజు తన పాదరక్షలను గది బయట వదలగా వాటిని ఓ కుక్క నోట కరుచుకుని పారిపోయిందట. దీంతో ఆగ్రహించిన ద్రౌపది కుక్కలకు శాపమిస్తుంది. ఇకపై ఎప్పుడు శృంగారం చేసుకున్నా కుక్కలు బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగానే శృంగారంలో పాల్గొంటాయని శాపం పెట్టింది.

5. ద్రౌపది పాండవులతో కలిసి చక్కని గృహిణిగా మెలిగేదట. ఆమె వంట గదిలో వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచుకునేదట. దీంతో అతిథులు ఎందరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా వంట చేసి పెట్టేదట. అలా ఆమె చక్కని గృహిణిగా ఉండేదట.

6. ద్రౌపదికి ఒక వరం ఉంది. అదేమిటంటే.. ఆమె తన భర్తలతో సంభోగించినా ఎప్పటికీ కన్యగానే ఉంటుందట. ఒక భర్తను వదిలి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ఆమె అగ్ని నుంచి నడుస్తుందట. దీంతో మళ్లీ ఆమె కన్యగా మారేదట.

7. నిండు సభలో ద్రౌపదికి కౌరవుల చేతిలో వస్త్రాపహరణం జరగడం, విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు కీచకుని చేతిలో భంగ పడడం వంటి సంఘటనల వల్ల ద్రౌపదికి తన ఐదుగురు భర్తలపై నమ్మకం పోయిందట. దీంతో ఆ రెండు ఘటనల తరువాత ద్రౌపది తన భర్తలను అంతగా నమ్మడం మానేసిందట.

8. భీముడి భార్య హిడింబకు జన్మించిన పుత్రుడు ఘటోత్కచుడు. అతనిపై ఓ సారి ద్రౌపది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని శపిస్తుందట. దీంతో అది చూసిన హిడింబ తన కుమారుడికి శాపం పెడుతావా అని చెప్పి ద్రౌపదికి ఆమె శాపం పెడుతుందట. అలా పాండవుల పతనం ప్రారంభమవుతుందట.

9. ద్రౌపది పాండవులు 5 మందిని చేసుకున్నప్పుడు వారికి ఒక షరతు పెడుతుందట. అదేమిటంటే.. తన భర్తలు వేరే ఇతర స్త్రీలు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పిందట. అయినప్పటికీ పాండవులు ఐదుగురు తమ భార్య ద్రౌపది కాకుండా ఇతర స్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కంటారు.

10. ద్రౌపది ఎవరితోనూ స్నేహం చేసేది కాదట. కేవలం కృష్ణుడితోనే స్నేహంగా ఉండేదట. ఎందుకంటే.. కృష్ణుడు వస్త్రాపహరణంలో ద్రౌపదికి చీరలను అందించి సహాయం చేస్తాడు కదా. దీంతో ఆమె కృష్ణున్ని బాగా నమ్మేదట. అతనితోనే స్నేహంగా సోదరిలా ఉండేదట.

Comments

comments

Share this post

scroll to top