సొంతంగా కంపెనీల‌ను పెట్టి స‌క్సెస్‌ఫుల్‌గా వాటిని నిర్వ‌హిస్తున్న మ‌హిళ‌లు వీరు తెలుసా..!

పురుషుల‌కు ఏమోగానీ స్త్రీల‌కు మాత్రం ఓ వైపు జాబ్ చేయ‌డం, మ‌రో వైపు ఇంటి ప‌నులు చూసుకోవ‌డం రెండూ క‌ష్టంగానే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వారు చాలా ఒత్తిడికి లోన‌వుతుంటారు. అయినప్ప‌టికీ ఈ రెండు ప‌నుల‌నూ విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. అదే కోవ‌లో కొంద‌రు ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు కూడా. ఓ వైపు ఇంటి ప‌నుల‌ను, ఇంటి సభ్యుల‌ను చూసుకుంటూనే మ‌రో వైపు ఉద్యోగాల్లో ఉన్న‌త ల‌క్ష్యాల‌ను సాధిస్తారు. ఉన్న‌త స్థాయికి చేరుతారు. కింద ఇచ్చింది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ప‌లువురు మ‌హిళ‌ల గురించే. వీరు మ‌న దేశంలోని ప‌లు ప్ర‌ముఖ కంపెనీల‌లో ఉన్న‌త స్థానాల్లో ప‌నిచేసి సొంతంగా కంపెనీల‌ను పెట్టి స‌క్సెస్ అయ్యారు. వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. షీలా కొచుసెప్ చిట్టిల‌ప్పిల్లి
వి గార్డ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ కొచుసెప్ చిట్టిల‌ప్పిల్లిని షీలా పెళ్లి చేసుకుంది. అయినా ఈమె సొంతంగా ఫ్యాష‌న్ డిజైనింగ్ ప‌ట్ల ఆస‌క్తి ఉండ‌డంతో త‌న భ‌ర్త నుంచి రూ.20 ల‌క్ష‌లు అప్పుగా తీసుకుని వీ స్టార్ అనే గార్మెంట్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ బిజినెస్ కొన్ని కోట్ల ట‌ర్నోవ‌ర్‌ను క‌లిగి ఉంది.

2. మీనా గ‌ణేష్‌
ఐఐఎం సీ, ఎన్ఐఐటీల‌లో విద్య‌ను అభ్య‌సించింది. ప‌లు కార్పొరేట్ కంపెనీల్లో ప‌నిచేసింది. త‌రువాత సొంతంగా క‌స్ట‌మ‌ర్ అస్సెట్ అనే కంపెనీ ప్రారంభించి విజ‌య‌వంతంగా దాన్ని ర‌న్ చేస్తోంది. హెల్త్ కేర్ రంగంలో సేవ‌లను అందిస్తోంది.

3. రేఖా కక్క‌ర్
ఈమె గ‌తంలో ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేసేది. త‌రువాత సొంతంగా మై టేస్టీ క‌ర్రీ అనే బ్లాగ్‌ను ప్రారంభించింది. అందులో ఫుడ్‌, ఫొటోగ్ర‌ఫీ, ట్రావెలింగ్ వంటి అంశాల‌కు చెందిన పోస్టుల‌ను పెట్ట‌డం ప్రారంభించింది. ఇప్పుడు దాన్నీ సక్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తోంది.

4. ల‌ల్ఫాక్జుఅలీ
భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న ఈమె సొంతంగా దుస్తుల వ్యాపారం ప్రారంభించి స‌క్సెస్ అయింది. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఆమె కంపెనీలో ఇప్పుడు అనేక మంది మ‌హిళ‌లు ఉపాధి పొందుతున్నారు.

5. సోమా చ‌ట‌ర్జీ మైటీ
భువనేశ్వ‌ర్‌లోని ఖోర్దా అనే ప్రాంతంలో ఈమె స్కూల్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తూనే మ‌రోవైపు సొంతంగా చీర‌లు, ఇత‌ర దుస్తుల‌ను వాట్సాప్ ద్వారా స్థానికుల‌కు విక్ర‌యిస్తోంది. గ‌తంలో అస‌లు ఆమెకు వాట్సాప్ అంటే తెలియ‌దు. కానీ అందులోనే స్వ‌యం ఉపాధి పొంది రాణిస్తోంది.

6. సైరీ చాహ‌ల్
ఘజియాబాద్ ఐఎంటీలో ఈమె పీజీ విద్య‌ను అభ్య‌సించింది. జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఫ్లెక్సి మామ్స్ అనే సంస్థ‌ను స్థాపించింది. షీరోస్‌.ఇన్ అనే మ‌రో కంపెనీకి సీఈవోగా ప‌నిచేస్తోంది. ఈమె అనేక మంది మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తూ సేవ‌ల‌ను అందిస్తోంది.

7. అదితి గుప్తా
జార్ఖండ్‌లోని ఘ‌ర్వా అనే సిటీలో ఈమె పెరిగింది. ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయినా క‌ష్ట‌ప‌డి చ‌దివింది. Menstrupedia Comic అనే కంపెనీని సొంతంగా స్థాపించి ర‌న్ చేస్తోంది. రుతుక్ర‌మంపై జ‌నాల్లో నెల‌కొన్న అపోహ‌ల‌ను ఈమె తొల‌గిస్తోంది.

8. ప్ర‌చీ ఎస్ వైష్
ఈమె క్లినిక‌ల్ సైకాల‌జీ చ‌దివింది. 10 సంవ‌త్స‌రాల పాటు ఓ మ్యాగ‌జైన్‌లో ప‌నిచేసింది. ప్ర‌స్తుతం హోప్ నెట్ వ‌ర్క్ అనే ఆన్‌లైన్ సైకాల‌జీ క‌న్స‌ల్టెన్సీని సొంతంగా నిర్వ‌హిస్తూ స‌క్సెస్ బాట‌లో ప్ర‌యాణిస్తోంది.

9. బండిటా బోస్
టెలీ క‌మ్యూనికేష‌న్స్ విద్య‌ను ఈమె అభ్య‌సించింది. మార్కెటింగ్ నిపుణురాలిగా మారింది. సొంతంగా Unchainedreamz అనే కంపెనీని ప్రారంబించింది. త‌న క్రియేటివ్ వ‌ర్క్‌ను ఇప్పుడు ఆన్‌లైన్ లో సేల్ చేస్తోంది.

10. ప్రేర్నా సింగ్
ఈమె ఫేస్‌బుక్‌లో జ‌స్ట్ ప్రేర్నా అనే పేజీని క్రియేట్ చేసింది. దాని ద్వారా జ్యువెల్ల‌రీ వ్యాపారం చేస్తూ స‌క్సెస్ అయింది. ప‌లు ప్ర‌ముఖ జ్యువెల్ల‌రీ సంస్థ‌ల‌తో ఈమె టై అప్ అయి ఆభ‌ర‌ణాల‌ను విక్ర‌యిస్తోంది.

 

Comments

comments

Share this post

scroll to top