ఢిల్లీలో ఉన్న ఈ చారిత్ర‌క నిర్మాణాలు ఒక‌ప్పుడు క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండేవి… నేడు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయి..!

మ‌న దేశంలో ఎన్నో చారిత్రాత్మక ప్ర‌దేశాలు ఉన్నాయి. ఒక్కో ప్ర‌దేశానికి ఎంతో ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఆయా ప్ర‌దేశాలు చ‌రిత్ర ఘ‌ట్టాల‌కు సాక్ష్యాలుగా కూడా ఉన్నాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే నేడు ప‌ర్యాట‌క ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. కానీ కొన్నింటిని మాత్రం మ‌న పాల‌కులు పూర్తిగా విస్మరించారు. అలా విస్మ‌రించ‌బ‌డిన చారిత్ర‌క ప్ర‌దేశాలు, నిర్మాణాలు ఢిల్లీలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తుగ్ల‌క్-ఎరా మ‌హ‌ల్‌, మ‌హిపాల్‌పూర్ (Tughlaq-era Mahal, Mahipalpur)
ఒక‌ప్పుడు ఈ ప్రాంతంలో చక్క‌ని పాఠ‌శాల ఉండేది. అయితే క్ర‌మంగా ఈ ప్ర‌దేశం శిథిలావ‌స్థ‌కు చేరుకుంది. ఎవ‌రూ దీన్ని ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ క‌ట్ట‌డంలోని మెటీరియ‌ల్స్‌ను భ‌వ‌న నిర్మాణాల్లో వాడుతున్నారు. త్వ‌ర‌లోనే ఇక ఈ పాటి నిర్మాణం కూడా మ‌న‌కు క‌నిపించ‌దు.

2. మీర్జా గాలీబ్ హ‌వేలి (Mirza Ghalib’s Haveli)
మీర్జా గాలీబ్ ప్ర‌ముఖ క‌వి. సాహితీ వేత్త‌. ఆయ‌న ఇల్లే ఇది. ప్ర‌స్తుతం ఇది కూడా శిథిలావ‌స్థ‌కు చేరుకుంది. అత్యంత దీన స్థితిలో ఉంది. దీని గురించి కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

3. చిరాగ్ ఢిల్లీ చారిత్ర‌క నిర్మాణాలు
ఈ ప్రాంతంలో ఒక‌ప్ప‌టికి చెందిన అనేక ఇల్లు, చారిత్ర‌క భ‌వ‌న నిర్మాణాలు ఉన్నాయి. ఒక‌ప్పుడు ఈ నిర్మాణాలు ఉన్న ప్రాంతం న‌గ‌రంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు శిథిలావ‌స్థ‌కు చేరుకుంది.

4. లాల్ మ‌హ‌ల్ (Lal Mahal)
ఇప్పుడు ఈ క‌ట్ట‌డం చుట్టు పక్క‌లంతా చెత్త పేరుకుపోయి అధ్వాన్న స్థితిలో ఉంది. కానీ ఒక‌ప్పుడు ఇది ఎంతో పేరుగాంచిన భ‌వ‌న నిర్మాణంగా గుర్తింపు పొందింది.

5.మౌలానా ఆజాద్ స‌మాధి
ఈ నిర్మాణం చుట్టు పక్క‌లంతా ఇప్పుడు క‌బ్జాకు గురైంది. లోప‌లంతా శిథిలావ‌స్థ‌కు చేరుకుంది. అందుకు పాల‌కులే కార‌ణం.

6. నిలా గుంబ‌డ్ (Nila Gumbad)
ఒక‌ప్పుడు ఇది ఎంతో సుంద‌ర‌మైన ప్ర‌దేశంగా వ‌ర్ధిల్లింది. ఇప్పుడు దీని వ‌ద్ద చెత్త‌ను పారేస్తున్నారు. దీని ప‌రిస‌రాల‌ను అత్యంత ద‌యనీయంగా త‌యార‌య్యాయి.

7. రాజోన్ కీ బౌలి (Rajon Ki Baoli)
ఒక‌ప్పుడు ఈ చారిత్ర‌క క‌ట్ట‌డం సుంద‌ర‌మైన ఉద్యాన‌వ‌నంగా ఉండేది. నేడు కాలుష్య కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతోంది.

8. పీర్ ఘాయిబ్ (Pir Ghaib)
ఒక‌ప్పుడు ఈ ప్ర‌దేశంలో యువ‌త‌, చిన్నారులు వ్యాయామం చేసేవారు. వారికి చ‌క్క‌ని ఆట స్థలంగా కూడా ఉండేది. పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఇప్పుడీ ప్రాంతం అత్యంత ద‌యనీయ స్థితికి చేరుకుంది.

9. జ‌హాజ్ మ‌హ‌ల్ (Jahaz Mahal)
ఈ ప్ర‌దేశాన్ని అభివృద్ధి చేసి ఉంటే గొప్ప చారిత్ర‌క నిర్మాణం అయి ఉండేది. కానీ నేడు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుని దీనావ‌స్థ‌కు చేరుకుంది.

10. మెహ్రౌలీ ఆర్కియ‌లాజిక‌ల్ పార్క్ (Mehrauli Archaeological Park)
ఒక‌ప్పుడు ఈ నిర్మాణం ఎంతో సుంద‌ర‌మైన ఉద్యాన‌వ‌నంగా ఉండేది. ప‌చ్చ‌ని ప‌చ్చిక బ‌య‌ళ్లు ఉండేవి. నేడు కాలుష్యం, వ్య‌ర్థాల‌తో నిండిపోయి శిథిలావ‌స్థ‌కు చేరుకుంది.

Comments

comments

Share this post

scroll to top