ఈ 10 సింపుల్ ప్రశ్నలకు… ఆన్సర్లు చెప్పగలిగితే మీరు చాలా గ్రేట్.! ట్రై చేయండి.?

ఇప్పుడు మిమ్మల్ని ఓ 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది.వాటికి జెన్యూన్ గా సమాధానం చెప్పాలి. ఎవరు ఏమనుకుంటారో అని కాకుండా..మీకు నిజంగా అనిపించింది చెప్పాలి. ఇవన్నీ  మీ లైఫ్ లో మీకు ఎదురైనవే, వీటన్నింటినీ మీరు నిత్యం ప్రత్యక్షంగా అనుభవిస్తూనే ఉన్నారు.

10 ప్రశ్నలు:

  • 1Q: పక్కింటి ఆంటీ…ఎదురింటి అబ్బాయి పెళ్లి సంబంధాల విషయంలో ఎందుకంత ఇంట్రస్ట్ చూపుతుంది.?
  • 2Q:పేరెంట్స్ తమ పిల్లల్ని ఇంజనీర్ గానే చూడాలని అనుకుంటారు ఎందుకనీ.?
  • 3Q: పరిచయం కాగానే పేరు అడుగుతారు ఎందుకనీ…?
  • 4Q:లవ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు…నా పిల్లలకు అరేంజ్డ్ మ్యారేజే చేస్తామ్ అనే తల్లిదండ్రుల మాటలో నిగూఢార్థం ఏంటి?
  • 5Q: చిన్నప్పుడింత ఉండేదానికి, ఇప్పుడు చూడు ఎంత పెద్దగయ్యావో…అనే మాటల వెనుకున్న అసలు అర్థం.
  • 6Q: హోటల్ కు వెళ్లి… అరేయ్ మీరు ఆర్డర్ ఇవ్వండ్రా…నాకు ఆకలిగా లేదు అని ఫ్రెండ్ అన్నాడంటే..?
  • 7Q:నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అని తండ్రి కొడుకుతో అన్నాడంటే…?
  • 8Q:చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు….స్నాక్స్ ఏవైనా పెడితే…అరె..ఇప్పుడివన్నీ ఎందుకండీ అని చుట్టాలు అంటే….?
  • 9Q: ఏం బాబూ…ఎన్ని మార్కులొచ్చాయ్ అని ఓ అబ్బాయిని పక్కింటి అంకుల్ అడగడం వెనుకన్న అసలు అర్థం.
  • 10Q: అరేయ్ ఆ ప్రిడ్జ్ లోని వాటర్ తాగకురా? అనే మాట వెనుక అసలు అర్థం ఎంటో తెలుసా?

ఈ ప్రశ్నలు అడిగిన వారిలో 90 శాతం మంది చెప్పిన జవాబులు ఇలా ఉన్నాయ్…( ఇవి జెన్యూన్ గా చెప్పిన ఆన్సర్లు…..ఎవ్వరూ  సీరియస్ గా తీసుకోవొద్దు.!)

10 ప్రశ్నలు& వాటికి 90 శాతం మంది చెప్పిన సమాధానాలు:

1Q: పక్కింటి ఆంటీ…ఎదురింటి అబ్బాయి పెళ్లి సంబంధాల విషయంలో ఎందుకంత ఇంట్రస్ట్ చూపుతుంది.?
Ans: ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తున్న అతగాడి పీడ వదిలుతుందని తలచి….
2Q:పేరెంట్స్ తమ పిల్లల్ని ఇంజనీర్ గానే చూడాలని అనుకుంటారు ఎందుకనీ.?
Ans: చుట్టు పక్కల ఉన్న వాళ్ల పిల్లలు, బంధువుల పిల్లలు… ఇంజనీర్స్ అవుతుంటే…నా కొడుకు/కూతురు ఎందుకు కాలేరు అనే పోటీతో…!
3Q: పరిచయం కాగానే పేరు అడుగుతారు ఎందుకనీ…?
Ans: అతని మతం, కులం గురించి తెల్సుకోవడానికి.
4Q:లవ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు…నా పిల్లలకు అరేంజ్డ్ మ్యారేజే చేస్తామ్ అనే తల్లిదండ్రుల మాటలో నిగూఢార్థం ఏంటి?
Ans: లవ్ మ్యారేజ్ అయితే కట్నం రాదు కదా!
5Q: చిన్నప్పుడింత ఉండేదానికి, ఇప్పుడు చూడు ఎంత పెద్దగయ్యావో…అనే మాటల వెనుకున్న అసలు అర్థం.
Ans:నువ్వు వయసుకు వచ్చావ్…మరి పెళ్లి ఎప్పుడు ? వీలైనంత త్వరగా చేసుకోమని.
6Q: హోటల్ కు వెళ్లి… అరేయ్ మీరు ఆర్డర్ ఇవ్వండ్రా…నాకు ఆకలిగా లేదు అని ఫ్రెండ్ అన్నాడంటే..?
Ans: బిల్ కట్టడంలో తన వాటా అడగొద్దని…!
7Q:నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అని తండ్రి కొడుకుతో అన్నాడంటే…?
Ans:అరేయ్…నేను అప్పుడే సంపాదించడం స్టార్ట్ చేశా…నువ్వేమో ఇంకా బేవర్స్ గా తిరుగుతున్నావ్ అని అర్థం.
8Q:చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు….స్నాక్స్ ఏవైనా పెడితే…అరె..ఇప్పుడివన్నీ ఎందుకండీ అని చుట్టాలు అంటే….?
Ans:వెయిటింగ్..ఇక్కడ…వచ్చి ఇంతసేపైందీ..తినడానికి ఇంకా ఏమీ పెట్టలేదేందీ? ..తెండి త్వరగా అని అర్థం.!
9Q: ఏం బాబూ…ఎన్ని మార్కులొచ్చాయ్ అని ఓ అబ్బాయిని పక్కింటి అంకుల్ అడగడం వెనుకన్న అసలు అర్థం.
Ans:పుసుక్కున అతడి కొడుకు కంటే ఈ బాబు కు ఎక్కువ మార్కులేమైనా వచ్చేయేమోనని చిన్న భయం.
10: అరేయ్ ఆ ప్రిడ్జ్ లోని వాటర్ తాగకురా? అనే మాట వెనుక అసలు అర్థం ఎంటో తెలుసా?
Ans: ప్రిడ్జ్ లో నింపిన వాటర్ బాటిల్స్ తాగేసి, మళ్లీ నింపి, ప్రిడ్జ్ లో పెట్టడు అనే ఉద్దేశ్యంతో….!

SOURCE: ScoopWhoop

Comments

comments

Share this post

scroll to top