దొంగతనం.. హత్య.. వ్యభిచారం.. ఇలా చెప్పుకుంటూ పోతే అసాంఘిక కార్యకలాపాల లిస్ట్ చాంతాడంత అవుతుంది. అయితే వీటిల్లో ఏ నేరం చేసినా నిందితుడి నేరం రుజువైతే అతను చేసిన నేరానికి, దాని తీవ్రతను బట్టి శిక్ష వేస్తారు. అది రక రకాలుగా ఉంటుంది. ఆ శిక్షల గురించి చట్టంలో ఉంటుంది. అయితే ఇవన్నీ మనకు తెలిసినవే. అయినా చట్టంలో మనకు తెలియని ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఇలాంటివి మన భారతీయ చట్టంలో ఇంకా ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. కానీ అది నిజమే. మరి వింతైన చట్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మన దేశంలో ఓటు హక్కు వచ్చేది 18 సంవత్సరాలు నిండాక. కానీ మద్యం సేవించేందుకు అనుమతి 21 సంవత్సరాల తరువాతే వస్తుంది. అయితే మీకు తెలుసా..? నిజానికి కొన్ని రాష్ట్రాల్లో మద్యం సేవించేందుకు అనుమతి 25 సంవత్సరాలుగా ఉంది. అంటే ఆయా రాష్ట్రాల్లో 25 ఏజ్ నిండితేగానీ మద్యం తాగరాదన్నమాట. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ రూల్ అమలులో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మద్యం సేవించేందుకు ఏజ్ 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. విచిత్రంగా లేదూ..!
2. మన దేశంలో గాలి పటాలను ఎగరేసేందుకు పోలీసుల అనుమతి కావాలని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం మన దేశంలో ఏ ప్రాంతంలో అయినా బెలూన్లు, ఎయిర్‌షిప్స్, గాలి పటాలు, గ్లైడర్స్, ఫ్లైయింగ్ మెషిన్లను ఎగరవేయకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షిస్తారు. నిజంగా ఇది వింతైనదే.
3. ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 ప్రకారం మన దేశంలో ఉత్తరాలను చేరవేసేందుకు అధికారం కేవలం భారతీయ పోస్టల్ సర్వీస్‌కే ఉందని మీకు తెలుసా..? కానీ ఇప్పుడు ప్రైవేటు కొరియర్ కంపెనీలు ఎక్కువయ్యాయి. ఈ చట్టం పాతదే అయినా దీని గురించి అందరూ మరిచిపోయారు.
4. మీకు తెలుసా ? మన దేశంలో వ్యభిచారం చేయవచ్చు. కానీ విటుడి వ్యాపారం ఎవరూ చేయరాదు. అవును, మీరు విన్నది నిజమే. వ్యక్తులు తమంత తాముగా ఇతరులతో సంబంధం లేకుండా, ప్రైవేటుగా వ్యభిచారం చేయవచ్చు. కానీ బ్రోకర్లు ఉండరాదు. ఉంటే చట్ట ప్రకారం శిక్ష వేస్తారు. ఇది చాలా ఫన్నీగా లేదూ..!
5. ఇప్పుడు చెప్పబోయే చట్టం గురించి తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే మన దేశంలో ఒక పురుషుడు ఒక మహిళతో వివాహేతర సంబంధం నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కాకపోతే అందుకు ఆమెతోపాటు ఆమె భర్త అనుమతి తప్పనిసరి. అలా కాని పరిస్థితుల్లో సదరు పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే అతన్ని చట్ట ప్రకారం శిక్షిస్తారు. కానీ మహిళలకు ఈ రూల్ వర్తించదు. వారు ఎంత మందితో అయినా వివాహేతర సంబంధాలను కొనసాగించవచ్చు. ఇది మన దేశంలో మహిళలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న చట్టం.
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ 2000 ప్రకారం ఇంటర్నెట్లో పోర్న్ సైట్లను సందర్శించడం మన దేశంలో నిషిద్ధం. కానీ ఎవరైనా పబ్లిగ్గా ఈ పని చేయకూడదు. వారు నాలుగు గోడల మధ్య ప్రైవేటుగా ఎవరూ చూడనప్పుడు పోర్న్ సైట్లను వీక్షించవచ్చు. ఇది చట్టంలో ఉంది.
7. కేరళలో ఏ దంపతులు అయినా కేవలం ఇద్దరు పిల్లలనే కనాల్సి ఉంటుంది. మూడో వారిని కంటే సదరు దంపతులకు రూ.10వేల ఫైన్ వేస్తారు. ఇక ముగ్గురు పిల్లల్లో కేవలం మొదటి ఇద్దరికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.
8. ఢిల్లీలో ఒక వింత రూల్ అమలులో ఉంది. అదేమిటంటే… లోకల్ సూపర్ మార్కెట్ల నుంచి వినియోగదారులు బీర్లను హోం డెలివరీ రూపంలో ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ బీర్ తప్ప మిగిలిన లిక్కర్ డ్రింక్స్‌కు మాత్రం ఆ అనుమతి లేదు.
9. ఇండియన్ పీనల్ కోడ్ 294 సెక్షన్ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్కు ఇబ్బంది కలిగేలా ఏదైనా చేసినా, వారిని ఏమైనా అన్నా అది నేరం అవుతుంది. న్యూసెన్స్ కేస్ కింద అరెస్ట్ చేస్తారు. మన దేశంలో ఇది అనేక ప్రాంతాల్లో రెగ్యులర్‌గా జరిగే విషయమే. అయినప్పటికీ దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు.
10. ఇండియన్ పీనల్ కోడ్ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం చేయడం చట్ట రీత్యా నేరం అవుతుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది ఇలాంటి సెక్స్‌కు పాల్పడుతున్నారు. వారు కూడా తమకు హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.