పూర్వకాలంలో అమలులోన్న అతిభయంకర శిక్షలు, వీటిని చూశాక తప్పు చేయాలన్నఆలోచనా కూడా రాదు.

ఘోరమైన నేరాలు చేసి తప్పుడు సాక్షాలను చూపి దర్జాగా బయట తిరుగుతున్న నేరస్థులకు లెక్కేలేదు,  కానీ పూర్వం అటువంటి వాళ్ళకు  శిక్షలు మామాలుగా ఉండేవికాదట. తప్పు చేసిన వాళ్ళకు ఎలాంటి క్షమాభిక్ష లేకుండా కఠిన శిక్షలు ఉండేవట. ఆ మధ్య తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు చిత్రంలో కొన్నే శిక్షలు చూసాం, కానీ మ్యాటర్ అంతకు మించి అన్నట్టు ఉందట…ఓ సారి  ఈ కింది శిక్షలు చూడండి,  తప్పు చేయాలన్న ఆలోచనా కూడా మన మెదడులోకి రాదు. ప్రపంచంలో ఇప్పటిదాకా అమలైన కొన్ని భయంకరమైన శిక్షలు చూడండి.
ఎలుకలతో చంపటం: 
అపరిచితుడు సినిమాలో జలగలను శరీరంపై వదిలి నేరం చేసినవాడిని హీరో హింసిస్తాడు గుర్తుందా. ఇది కూడా అలాంటిదే. నేరానికి పాల్పడ్డ వారి శరీరానికి ఒక పంజరం లాంటి దానిని అమర్చి, బయటనుండి పెద్ద మంటను పెడతారు. ఆ పంజరంలో కొన్ని ఎలుకలను వదులుతారు. బయటనుండి వచ్చే వేడికి లోపలున్న ఎలుకలు తట్టుకోలేక ఎదుటఉన్న వారిపై రక్కడం మొదలుపెడతాయి. కొన్నేళ్ళ క్రితం ఈ శిక్షను ఎక్కువగా అమలుచేసేవారు. ఇంకా కొన్ని చోట్ల నేరస్తుల నుండి నిజం రాబట్టేందుకు ఇలాంటి కటిన శిక్షలు విధిస్తున్నారు.
punishment13
ఇత్తడి ఎద్దును ఉపయోగించి:
ఇత్తడితో ఎద్దు ఆకారంలో తయారుచేసిన సిసిలీయన్ ఎద్దు మధ్యలో నేరం చేసిన వాళ్ళను పడుకోబెడతారు. రెండు వైపులా ఇనుప చువ్వలకు కట్టి కింద భగభగ మండుతున్న పెద్ద మంటను పెడతారు. ఇత్తడి కాబట్టి ఆ వేడికి మరింత హీట్ పెరుగుతుంది. ఈ పద్దతిని గ్రీకు దేశస్తులు అమల్లోకి తెచ్చారు.
punishment3
చర్మం ఒలుచుట:
ఇంకో సారి ఇలాంటి తప్పులు చేస్తే చర్మం ఒలుస్తా, తాటతీస్తా అని చాలామంది అంటుంటారు. ఇలాంటివి మాటల వరకే అనుకునేరు.. చేతల్లోనూ చేసి చూపెడతారు మెసోపోటియా వాళ్ళు. మూగ జంతువులను హింసించడం, చంపడం చేస్తే రాళ్ళతో, చేతులతో మన శరీరంపై చర్మాన్ని దపాల వారిగా తీసేస్తారు. ఈ విధంగా అమలు చేసే శిక్షలో చాలామంది శిక్ష మధ్యలోనే ప్రాణాలను వదిలేసినవారు ఎక్కువ.
punishment5
బ్రేకింగ్ వీల్:
ఈ శిక్ష చూడటానికి కొంచెం భయంకరంగా ఉండకపోయినా, శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రం యమరాజు కనిపిస్తూనే ఉంటాడు. ఒక పెద్ద చట్రానికి తప్పు చేసిన వాడిని కట్టేసి, ఊత కర్ర సాయంతో తిప్పుతారు. తిరుగుతున్న చట్రం కిందకు రాగానే దుడ్డుకర్ర తీసుకొని కింద అటు ఇటూ జరుపుతారు. ఎప్పుడైతే ఆ దుడ్డుకర్ర అతడికి తగిలిందో అప్పుడు ఒక్కొక్కటిగా అతడి శరీరంలోని ఎముకలు విరిగిపోతాయి.
punishment6
పోలుకు మధ్యలో:
మనం చేసే నేరాలకు తగ్గట్లే శిక్షలు ఉన్నాయి. రాజద్రోహం చేసి, ఒక దేశానికి సంబంధించిన విషయాలు ఇతర దేశానికి వర్తమానం పంపి నమ్మక ద్రోహం చేస్తున్న వాళ్ళను ఇనుప చువ్వ,పోలు, ఇలాంటి వాటిని కింద బొమ్మలో చూపినట్లుగా హింసిస్తారు. చూడటానికి భయంకరంగా ఉన్న ఈ శిక్షకు ఎంతమంది రాజద్రోహులు బలయ్యారో.
punishment11
ఏనుగుతో నుజ్జునుజ్జుగా:
పనిష్ మెంట్ ను చుస్తే ఇంకెవరు ఇలాంటి వాటికి పాల్పడకూడదు అనేలా కొన్ని శిక్షలు ఉంటాయి. నేరం చేసిన వాళ్ళను ఏనుగు కాళ్ళతో తొక్కిస్తూ ఉంటే ప్రజలు వినోదంలా చూసేవారట. మన దేశంలోనూ, దక్షిణ ఆసియా ఖండంలో ఈ శిక్ష ఎక్కువగా అమలులో ఉండేదట.
punishment12
రంపంతో కోయటం:
రోమన్ రాజ్యం, స్పెయిన్,ఆసియాలోని కొన్ని దేశాలలో తప్పు చేసిన వాళ్ళను రెండు చెక్కల మధ్య నేరస్థుల శరీరాన్ని కిందకు వేలాడదీసి పదునైన రంపంతో శరీరం రెండు ముక్కలయ్యేలా కటినంగా శిక్షిస్తారు.
punishment10
వేడినీటిలో వేయించి:
మనం తినే వస్తువులు కొంచెం వేడిగా ఉన్న తట్టుకోలేం. అలాంటిది సల సలకాగే నీటిలో లేదా నూనెను బాగా మరిగించి అందులో తప్పు చేసిన వాళ్ళను వేయించేవారు. ఇది ఎక్కువగా యూరప్,ఆసియా దేశాలలో అమలైందట.
punishment8
రాక్:
చతురస్త్రాకారంలో ఉన్న పెద్ద చెక్కను తీసుకొని,,, నాలుగు వైపులా చేతులకు, కాళ్ళకు నేరస్థుడిని కట్టి, నాలుగువైపులా ముందుకు,వెనక్కు ఒకేసారి లాగుతారు. ఈ శిక్ష సమయంలో శిక్షను అనుభవిస్తున్న వారి అవయవాలు ఒక్కొకటిగా తమ శరీరం నుండి విడిపోతాయి. చుడువుతుంటేనే/వింటుంటేనే భయంకరంగా ఉంది.
punishment4
చెవులను కత్తిరించడం:
శిక్ష అంటేనే ఆ తప్పు ఇంకెవరూ చేయకుండా, వీరికి జరిగుతున్న శిక్షలు మేం అనుభవించలేమని తెలిపేందుకు. మేకులను చెవి మధ్యలో ఉంచి, చెవికి చెక్కలను ఆన్చి సుత్తితో చెవి పక్కన మేకు దింపి కత్తిరించడం. ఎవరైనా చెవి కుట్టుకుంటేనే ఎన్నో బాధలు పడతారు.. అలాంటిది ఇక ఇది చూస్తే. చావుకు దగ్గరగా ఉన్నా సరే తప్పు చేసిన వారికి ఈ శిక్షను అమలుజేసి కటినంగా శిక్షించాల్సిందేనట.
punishment9
అగ్గితో కాల్చేయడం:
పూర్వం మనకు ఈ లైట్స్, లైటింగ్ వుండేది కాదు.. కొన్ని దేశాలలో నేరం చేసిన వాళ్ళను ఎలాంటి క్షమాభిక్ష పెట్టకుండా.. స్తంభాలకు గానీ పోళ్ళకు గానీ కట్టేసి, నిప్పంటించేవారట. ఆ శిక్ష అనుభవిస్తున్న మిగతా వారంతా అక్కడే వుండి తప్పకుండా చూడాల్సిందేనట.
punishment1

Comments

comments

Share this post

scroll to top