బౌల‌ర్ విసిరిన ఒక్క బంతి ముగ్గుర్ని గాయ‌ప‌రిచింది. ఎలాగో తెలుసా..? [VIDEO]

క్రికెట్ ఆటంటే ఒక్కో సారి అందులో కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. చివ‌రి బంతి వ‌ర‌కు ఏ టీం గెలుస్తుందా అన్న ఆతృత‌ను అభిమానుల్లో క‌ల‌గజేస్తుంది ఆ ఆట‌. ఇక కొన్ని మ్యాచ్‌లు చ‌ప్ప‌గా సాగితే కొన్ని మ్యాచ్‌ల‌లో అరుదైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ క్రికెట్ మ్యాచ్ గురించే. ఈ మ‌ధ్య జ‌రిగిన ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి వ‌ల్ల ముగ్గురికి గాయాల‌య్యాయి. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఆస్ట్రేలియాలో విక్టోరియ‌న్ ప్రీమియ‌ర్ క్రికెట్ అనే ఓ టోర్న‌మెంట్ స్థానికంగా జ‌రుగుతుంది. అందులో మొత్తం 18 టీమ్‌లు పాల్గొంటాయి. అయితే ఈ మ‌ధ్యే ఈ టోర్న‌మెంట్‌లో Footscray Edgewater, Fitzroy Doncaster అనే రెండు క్రికెట్ క్ల‌బ్‌ల మ‌ధ్య మ్యాచ్ అయింది. అందులో ఓ బౌల‌ర్ వేసిన బంతిని బ్యాట్స్‌మ‌న్ కొట్టాడు. దీంతో ఆ బ‌ల‌వంత‌మైన షాట్‌కు తాళ‌లేక బ్యాట్స్‌మ‌న్ భుజం ప‌ట్టేసి గాయం అయింది. ఈ క్ర‌మంలో ఆ బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టిన‌ప్పుడు నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉండే మ‌రో బ్యాట్స్‌మ‌న్‌కు ఆ బంతి తగిలి అత‌ను గాయ‌ప‌డ్డాడు.

ఇక వీరిద్ద‌రు మాత్ర‌మే కాకుండా ఆ బంతి అలా ట్రావెల్ అయి ప‌క్క‌నే ఉన్న అంపైర్ కాలికి త‌గిలింది. కానీ అంపైర్‌కు గాయం కాలేదు. ఇక ఆ బంతిని ప‌ట్టుకున్న ఓ ఫీల్డ‌ర్ దాన్ని బౌల‌ర్ మీద‌కు విసిరాడు. దీంతో అది ఆ బౌల‌ర్ ముఖంపై ప‌డింది. ఈ క్ర‌మంలో బౌల‌ర్‌కు కూడా గాయ‌మైంది. ఇలా ఒకసారి బౌల‌ర్ వేసిన‌ బంతి ముగ్గుర్ని గాయ‌ప‌ర‌చ‌డంతో ఇప్పుడీ సంఘ‌ట‌న క్రికెట్ మ్యాచ్ ల‌లో చోటు చేసుకునే అరుదైన సంఘ‌ట‌న‌గా న‌మోదైంది. వారు ఆడింది ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ కాక‌పోయినప్ప‌టికీ క్రికెట్ మ్యాచ్‌ల‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతాయి. అందుకే ఈ వీడియో వైర‌ల్ అయింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి..!

watch video here:

Comments

comments

Share this post

scroll to top