06-03-2019 రోజువారీ రాశిఫలాలు:

మేషం :

కుటుంబ సమస్య పరిష్కారం కావడంతో స్త్రీల మనస్సు కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, ప్రమోషన్ వంటి శుభవార్తలు అందుతాయి. వృత్తిపరంగా ఎదురైన చికాకులు అధికమిస్తారు. పాతమిత్రుల కలయిక మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఆహార, ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి.

వృషభం :

మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. క్రయవిక్రయాలు సామాన్యం. స్త్రీలకు అయినవారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. సర్దుబాటు ధోరణితో వ్యవహరించినా గాని కొన్ని సమస్యలు పరిష్కారం కావు.

మిథునం :

విద్యార్థులకు తోటివారి తీరు ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఖర్చులు అధికం. పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వాహనయోగం వంటి శుభఫలితాలున్నాయి.

కర్కాటకం :

వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించివలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. మీ సంతానం వివాహ, ఉద్యోగ, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. రుణాలు తీరుస్తారు.

సింహం :

దైవ కార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా నలుగురితో మాటపడాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.

కన్య :

ఆదాయానికి మించిన ఖర్చులున్నా ధనానికి ఇబ్బందులుండవు. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒక సమాచారం అందుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆశాజనకం. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల :

నూతన వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన వనరులు, లైసెన్సులు సమకూర్చుకుంటారు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది.

వృశ్చికం :

ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒక వ్యవహారం నిమిత్తం ప్రముఖులను, న్యాయవాదులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు.

ధనుస్సు :

ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ధనం ఏ కొంతైనా పొదుపుచేద్దామనుకున్న మీ ఆలోచన ఫలించదు.

మకరం :

స్త్రీలకు అయిన వారి నుంచి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. విద్యార్థులకు దూరప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, అదనపు బాధ్యతలు తప్పవు. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

కుంభం :

లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణానికి కావలసిన ప్లానుకు ఆమోదం లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యాపారాలు సంస్థలు, పరిశ్రమలు స్థాపనలు కొంత కాలం వాయిదా వేయడం శ్రేయస్కరం. ప్రముఖులను కలుసుకుంటారు.

మీనం :

గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు లోను మంజూరవుతుంది. రిప్రజింటేటివ్‌లకు, పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. చేజార్చుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికాక విసుగు కలిగిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top