08-06-2018 రోజువారీ రాశిఫలాలు..!

మేషం :

బంధుమిత్రులతో వచ్చి మనస్పర్ధలు కాస్త సర్దుకుంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. శ్రీమతి శ్రీవారి మధ్య అనుమానాలు అపోహలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభం :

మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్త ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.

మిథునం :

స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. దూర ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడుతాయి.

కర్కాటకం : 

మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. సంగీత, సాహిత్య సదస్సుల్లో పాల్గొంటారు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాబడికి మించిన ఖర్చులుండటంతో అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.

సింహం :

వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకం అవుతుంది. కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సోదరీ, సోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు.

 

కన్య :

ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో వాగ్వివాదాలు మంచిది కాదని గమనించండి. విందులు, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయకండి. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి/శ్రీవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు.

తుల :

వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు మందకొడిగా వుంటుంది. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సాహస ప్రయత్నాలు విరమించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.

 

వృశ్చికం 

పాతమిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. సినిమా, కళారంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్చాతుర్యమునకు మంచి గుర్తింపు లభిస్తుంది. అసలైన శక్తి సామర్థ్యాన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీ అతిథి మర్యాదలు బంధుమిత్రులను ఆకట్టుకుంటాయి.

 

ధనుస్సు :

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుంచి సంబంధాలు ఖాయమవుతాయి. విందులలో పరిమితి పాటించండి.

మకరం : 

బేకరి, పండ్ల, పూల, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధఇ. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. భాగస్వామిక చర్చల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 

కుంభం 

ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు.

 

మీనం : 

బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. శ్రీమతి, శ్రీవారుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top