02-03-2019 రోజువారీ రాశిఫలాలు!!

మేషం :

ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారి సంఖ్య పెరుగుతోందని గ్రహించండి. పారిశ్రామిక కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం.

వృషభం :

కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమన్వయం లోపిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అధిక శ్రమ తప్పదు.

మిథునం :

భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యుల కోసం విరివిగా ధనవ్యయం చేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. చిరువ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు.

కర్కాటకం :

కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు స్టాకిస్టులకు, వ్యాపారులకు కలిసిరాగలదు.

సింహం :

బంధువులను కలుసుకుంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫుర్తిస్తుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీయవచ్చు. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి.

కన్య :

ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. గృహోపకరణాల వ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు.

తుల :

వైద్య రంగాలవారికి పురోభివృద్ధి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునః ప్రారంభిస్తారు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కారిస్తారు. ఆపదసమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు.

వృశ్చికం :

భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త రొత్త పథకాలు రూపొందిస్తారు. కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

ధనుస్సు :

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించినందుకు కించిత్ పశ్చాత్తాపం చెందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

మకరం :

ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. స్థిరాస్తిని అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.

కుంభం :

విద్యార్థుల నిర్లక్ష్యం, మతిమరుపు కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం.

మీనం :

ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్య విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహా, సహకారం తీసుకోవడం మంచిది.

Comments

comments

Share this post

scroll to top