ఈ రోజు: 2-02-2019 ( శనివారం ) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

మేషం:

ఈ రోజు సరైన నిర్ణయాలను తీసుకొనడంలో సమయాన్ని వెచ్చిస్తారు,మీకు తెలిసినటువంటి నిజాలని మీ శ్రేయోభిలాషుల,కు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు,కొన్ని కొన్ని రహస్యాలను మాత్రం మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది,అదృష్ట రంగు మెరూన్,అదృష్ట సంఖ్య మూడు

వృషభం:

గృహ సంభందమైనటువంటి అలంకరణ సామాగ్రి ఫర్నిచర్ వంటివి కొనుగోలు చేయడానికి సరైన సమయం ,ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కొని,ఇంటిని చక్కబెట్టుకొనుటకు ఇది శుభతరుణం, మీ పరధ్యానం వల్ల ఒక అనూహ్య సంఘటన సంఘటన జరిగే అవకాశం ఉంది ,అదృష్ట సంఖ్య ఎనిమిది.

మిథునం:

మీ వినయ విధేయతల కారణంగా క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కుంటారు,మీ వ్యతిరేక వర్గం వారు మిమ్మల్ని అధికమించినా చివరికి విజయం మీదే,కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి,మీ మనోబలం కారణంగా ,మీమీ నైపుణ్యాల కారణంగా మీరు బలవంతులవుతారు.

కర్కాటకం:

మిమ్మల్ని చులకనగా ,అపహాస్యం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉంటారు ,వారు ఎన్ని మార్గాలలో మిమ్మల్ని ఎదుర్కొన్నా లెక్క చేయరు,మీ మీద ఉన్న మంచి అభిప్రాయాల కారణంగా భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతలు పొందగలరు.మీ భావాలను సొంత వారిముందు వ్యక్తపర్చవద్దు.

సింహం:

మీరు మొదటి నుండి స్థిరమైన ఉద్యోగం చేయలేదు ,కనుక మంచి పనిని ఎన్నుకుని పూర్తివరకు శ్రమపడండి,పాత నైపుణ్యాల కారణంగా కొత్త భాద్యతలను ఎదుర్కొనగలరు,మీ యొక్క స్కిల్స్ మీద దృష్టిసారించండి.మీరు స్థిరమైన నమ్మకమే మీకు విజయాన్నిస్తుంది ,అదృష్ట రంగు ఊదా .

కన్య:

ఈ రోజు మీరు సాధారణంగా ఉంటారు ,మీ శత్రువులు మిమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నంలో గెలిచి మిమ్మల్ని భాదపెడతారు,ఐనా మీరు ఆ అవమానాన్ని ఆనందంగా స్వీకరిస్తారు,ఇదే మీకు మంచి కీర్తిని ,అవగాహనను పెంచుతుంది

తుల:

ఈరోజు తులా రాశి వారికి శుభదాయకం,మిమ్మల్ని కొందరు గమనించి మీకు కొత్త అవకాశాలను ఇచ్చే ఆస్కారం ఉంది.రెస్టారెంట్,హోటళ్లు వంటివి మొదలు పెట్టడానికి శుభతరుణం,చిన్న చిన్న విషయాల పట్ల,స్వల్ప మనస్కుల పట్ల అప్రమత్తంగా ఉండండి .

వృశ్చికం:

పుస్తక పఠనం వల్ల వివేకాన్ని,సన్నిహితులవల్ల కొంత వరకు విజయాన్ని సాధిస్తారు,ఈ రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ద్రుష్టి సాధిస్తారు,మీకు తెలిసిన విషయాలను అమలుపర్చడంలో వేగంగా ఉండండి ,అదృష్ట సంఖ్య ఏడు .

ధనుస్సు:

మీ కష్టసుఖాల్లో మీరు రెండింటిని స్వీకరించాలి ,మీ యొక్క సాలిడ్ మైండ్ కారణంగా మీరు నెమ్మదిగా ఉన్నారు ,జీవితంలోని అన్ని రుచులను ఆనందంగా ఎదుర్కొని సంతులనం కనుగొనండి,మిమ్మల్ని ఈరోజు నాలుగు సంఘటనలు ముఖ్యంగా ప్రభావితం చేస్తాయి.

మకరం:

ఈ రాశి వారు నక్షత్రబలం వల్ల క్లిష్టపరిస్థితులలో సైతం రాణించగలరు,మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల ఫలితాలు ఆలస్యంగా వెలుగులోకి రావొచ్చు ,దాని ప్రభావం మీ మీదనే ఉంటుంది ,ఏదేమైనా ముక్కుసూటిగా వ్యవరించుట మంచిది

కుంభం:

ఈ రోజు మీరు ఉల్లాసంగా గడుపుతారు,కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఆన్లైన్లోని వాటిపట్ల జాగ్రత్తగా ఉండండి.మీకు అవకాశం వచ్చినప్పుడు నిజాన్ని పొడిగించకుండా ,అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ,మీ నిజాయితీ కారణంగా ఎక్కువకాలం పాటు రాణిస్తారు.

మీనం:

ఈ రోజు నిరాశావాదం తో ఉంటారు,కానీ చివరకు కొంత ఊరట చెందుతారు,మీ పాత మిత్రులను కలిసినప్పుడు వారితో చర్చించిన మాటలను జ్ఞప్తి తెచ్చుకోవడం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది ,చిన్న చిన్న వివాదాస్పద చర్చల్లో పాల్గొనకపోవడం మంచిది.

 

Comments

comments

Share this post

scroll to top