శ్రీ పంచముఖ తామ్ర(రాగి) గణపతి ని చూడాలంటే కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లాల్సిందే

babai babai

నంద్యాల (ఏపి 2 టిజి ):వినాయక చవితి సందర్బంగా ఎవరికీ తోచిన రీతిలో వారి స్తోమత ను బట్టి గణపతి విగ్రహాన్ని పెట్టి పూజలుచేసి నిమజ్జనం చేయడం ఆనవాయితి. ఐతే విగ్రహ తయారీలో రసాయనాలు విచలవిడిగా వాడటం అలవాటుగా మారి పర్యావరణ ముప్పు ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని గణపతి నిమజ్జన కమిటీలు మట్టివిగ్రహాలు పెట్టాలని పిలుపు ఇస్తున్నాయి . ఈ నేపద్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని సంజీవ నగర్ రామాలయంలో గత 6 సంవత్సరాలుగా భగవత్ సేవా సమాజ్ వారి అధ్వర్యంలోవిభిన్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 2012లో కొబ్బరి కాయలతో నారికేళ గణపతిని, 2013లో గోడంబి, బాదం పప్పు తో,2014లోవేరుశనగకాయలతో 2015లో పట్టు దారంతో కూడిన బంతులతో, 2016దుర్వహరితగణపతిని, 2017లో విద్యార్థులు కోసం పుస్తకాలు, పెన్సిళ్ళుతో, గణపతి విగ్రహాలను ఇతర రాష్ట్రాల నిపుణులతో తాయారు చేయించి విశేష పూజలు నిర్వహించి భక్తులను విశేషంగా ఆకట్టు కున్నారు. ఈ ఏడాదికూడా భగవత్ సేవ సమాజ్ అద్యక్షులు సూరయ్య ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ తామ్ర గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి పచ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నిపుణులతో 2345రాగి రేకుల కలసాలతో,555రాగి తట్టలతో 555 రాగి వుద్దరేనిలుతో ఈ విగ్రహాన్ని తాయారు చేస్తున్నారు. ఉత్సవాలు ప్రారంబంలోనే ప్రత్యేక విగ్రహం తో పాటుగా నిమజ్జనం కోసం మరో విగ్రహాని ఏర్పాటు చేస్తారు. విభిన్న రీతిలో ఏర్పాటు చేసిన విగ్రహ నికి ఉపయోగించిన సామగ్రిని నిమజ్జనం తర్వాత బక్తులకు ఇస్తారు. వీటికోసం భక్తులు క్యు కట్టడం విశేషం .ఈ ఏడాది కూడా రాగి కలసలు రాగి తట్టలకోసం మున్డుగాన్నే బక్తులు సేవా సమాజ్ ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.పర్యావరణ పరిరక్షణ కోసం గత 6 ఏళ్లుగా విభిన్న రీతిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న భగవత్ సేవ సమాజ్ వారు అభినందనీయలు.మరి ఈ ఏడాది 13నుండి 17 వరకు జరిగే వినాయక ఉత్సవాల్లో నంద్యాల సంజీవ నగర్ రామాలయం లో ఏర్పాటు చేసిన శ్రీ పంచముఖ తామ్ర గణపతిని దర్సిన్చుకుందాం .గణపతి అనుగ్రహం పొందుదాం 

Comments

comments