రుద్రమదేవి రివ్యూ &రేటింగ్.

      ******రుద్రమదేవి రివ్యూ &రేటింగ్.*******

Rudramadevi_Audio_Posters_(2)

Cast & Crew:
నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు
దర్శకత్వం : గుణశేఖర్
సంగీతం : ఇళయరాజా
నిర్మాత : గుణశేఖర్

STORY:

కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు( కృష్ణంరాజు) పరిపాలిస్తుంటాడు . ఆయనకు  ఏకైక సంతానం  రుద్రమదేవి .. రాజ్యాన్ని పాలించడానికి వారసుడు కావాలి కాబట్టి కాకతీయ ప్రజలకు రుద్రమదేవినే రుద్రదేవగా పరిచయం చేస్తారు. ఆమెకు మహామంత్రి శివదేవయ్య( ప్రకాష్రాజ్)  అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తాడు.

గణపతిదేవుని మరణం తరువాత. శివదేవయ్య అసలు విషయం చెప్పి రుద్రమదేవికి పట్టాభిషేకం చేస్తారు. మహిళ దగ్గర సామంతులుగా ఉండడానికి ఇష్టపడని సామంత రాజులు తిరుగుబాటుచేస్తారు. దీంతో రుద్రమదేవి రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో మహదేవ ( విక్రమ్జిత్)  సామంతులను ఏకం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. అస్తవ్యస్త పాలనను చూసి  గోన గన్నారెడ్డి (అల్లుఅర్జున్)  కూడా కాకతీయ సామ్రాజ్యంపై ఎదురుతిరుగుతాడు.

రాజ్యంలో అనిశ్చితిని రూపుమాపాలని ..దాని కోసం మీ సహాయం కావాలని రుద్రమదేవి, తనకు అత్యంత సన్నిహితుడైన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడి(రానా) సాయం కోరుతుంది. స్థిరమైన పాలన కోసం  గోన గన్నారెడ్డి కూడా వీరికి  చేయి కలుపుతాడు  వీరి లక్ష్యం  ఒక్కటే  కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. రుద్రమదేవి, వీరభద్రుడు,గోనగన్నారెడ్డిలు కలిసి ప్రత్యర్థుల నుండి తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారనేదే సినిమా.
Plus Points:

  • అనుష్క, అల్లు అర్జున్ నటన
  • విజువల్ ఎఫెక్ట్స్
  • సెట్టింగ్స్
  • ఫస్ట్ హాప్.

Minus Points:

  • సెకెండాఫ్.
  • ఎడిటింగ్.
  • మ్యూజిక్( ఎక్స్ పెక్ట్ చేసినంతగా లేదు).

Rating:    (3/5)

Verdict: చరిత్రను సజీవంగా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయిన గుణశేఖర్.

Watch  Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top