యూట్యూబ్ లో వైరల్ అవుతున్న స్మార్ట్ ఫోన్ తో తీసిన షార్ట్ సినిమా…

సినిమా చూసినంత ఈజీగా సినిమా తీయలేం.. కానీ చాలా చేతిలో ఉన్న ఫోన్ తో అద్బుతమైన సినిమా తీయోచ్చని నిరూపించారు .. ఇల్యూజన్ పేరుతో యూట్యూబ్ లో వైరల్ అవుతున్న షార్ట్ ఫిలిం తీసింది లక్షలు విలువ చేసే కెమెరా తో కాదు Letv Eco2 ఫోన్ తో… షూటింగ్,ఎడిటింగ్,డబ్బింగ్ అన్నీ ఫోన్ తోనే చేసారంటే చూసేవాళ్లకి నమ్మబుద్ది కాదు..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్లిక ఈ చిన్నసినిమా లోని బిజిఎమ్ అదిరిపోయింది అనకమానరు..పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్లు ఈ సీన్ ని ఇంత ఖర్చు పెట్టి తీసాం..ఆ సీన్ కి ఈ కెమెరా వాడాం అనే మాటలు విని.ఫోన్ తో తీసిన సినిమా చూసి వారి టాలెంట్ కి సలాం కొట్టకుండా ఉండలేం..

కార్టున్ చానెల్స్ చూస్తూ,కామిక్స్ చదువుతూ గడపాల్సిన మూడేళ్ల పిల్లాడు సినిమాలు చూస్తూ ..తాను పెద్దయ్యాక సినిమా ఎలా తీయాలి అని కలగనే  ఇతివృత్తంతో పంతొమ్మిదినిమిషాల నిడివిలో తీసిన షార్ట్ సినిమా..అందరిని ఆకట్టుకోవడమే కాదు..ఫోన్తో  ఎలా తీసాడ్రా బాబూ అని షాక్ కి గురిచేస్తుంది..కావాలంటే మీరూ చూడండి..

https://youtu.be/RpHuBLFLnLg

Comments

comments

Share this post

scroll to top