ఎ పి టు టు జి (కర్నూలు): కర్నూలు జిల్లా నల్లమలలో వెలిసిన నవనందులలో ఒకటైన శివనంది లో ఫిబ్రవరి 12 నుండి 14 వరకు మహా కుంభాభి షేక మహోస్తవం అంగరంగ వైభవంగా జరుగనుంది.జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం కడమల కాలవలో వెలిసిన శివనంది అత్యంత పురాతన మైనది. 6 వ శాతాభ్ది లో పులికేసి రాజులు ఈ ఆలయాన్ని పున్హ్నిర్మించినట్లు చెబుతారు పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని గుర్తించింది..మహా భారతం నాటి పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి కొన్ని కట్టడాలు నిర్మించి నట్లు ఆధారాలు వున్నాయి.ఈ ఆలయలో శివలింగం సైతం విభిన్నంగా వుంటుంది. ప్రతి శివరాత్రికి ఓ దేవతా సర్పం లింగం చుట్టి ఉంటుందని భక్తులు చెబుతారు.ఈ ఆలయంలోని లింగానికి అభిషేకం చేసి లింగాకారంలోని స్వామి వారికీ తమ కోరికలు విన్నవించుకుంటే కోరికలు తీరుతాయి అన్న నమ్మకం భక్తులకు వుంది..ప్రతి శివరాత్రికి నవనందుల దర్శనంలో భాగంగా శివనందిని అధిక సంక్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇలాంటి మహిమాన్విత దేవాలయంలో అడునీకరణ పనులు జరుగుతున్నాయి.జీర్ణోద్దరణ పనులలో భాగంగా ఫిబ్రవరి 12 నుండి వేదపండితులు నీలకంత శాస్త్రి ,మనికంట శర్మ భవాని శివ శంకర్ శర్మ ల ఆధ్వర్యంలో త్రయాహిక దీక్షతో నిర్వహిస్తున్నారు .కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణపతి పార్వతి అమ్మవారు ,నందీశ్వర స్వామి, ద్వజ స్తంభ ప్రతిష్ట ,శిఖర ప్రతిష్ట నవ గ్రహ ప్రతిష్ట మహా కుంభా బి షేక మహోస్తవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు .వెలది మందిగా భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తుండటంతో ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకోసం సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఇతర వివరాలకోసం 9550097575 నెంబర్ భవాని శివ శంకర శర్మ ను సంప్రదించ వచ్చు