డ్రైవర్ చేత చెప్పులు తొడిగించుకున్న స్పీకర్!

అతను ఓ శాసనసభకు స్పీకర్.. సభను సజావుగా నడిపించి, ప్రజా సమస్యలపై చర్చించడంలో ఆయని కీలక పాత్ర. ఆ పాత్ర వరకు ఆ స్పీకర్ గారికి మచ్చ లేదు.. కానీ ఇప్పుడు ఆయనకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫోటో మాత్రం కునుకు లేకుండా చేస్తోంది. ఆయన తన డ్రైవర్ చేత చెప్పులు తొడిగించుకుంటున్న ఫోటో అది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయ్.

అయితే దీనిపై ఆ స్పీకర్ గారి వివరణ వేరే విధంగా ఉంది.  తాను గత 18 ఏళ్లుగా కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని, వైద్యులు తనను ముందుకు వంగకుండా ఉండాలని చెప్పారని అందుకే తన బంధువైన డ్రైవర్‌ చెప్పులు తీయడంలో తనకు సహకరిస్తుంటాడని ఆయన అన్నారు. ఈ ఫోటోపై చర్చ జరుగుతుండటం తనను కలిచివేసిందనీ కేరళా స్పీకర్  శక్తన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top