డిజిటల్ లవాదేవిలతో నష్టపోయారా? అయితే ఇగో కంప్లైంట్ రెడీ మీదే లేట్

ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. క్షణాల్లో ఏ పని అయిన అయిపోతుంది. ఒకప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే బ్యాంక్ కు వెళ్లి క్యూ కట్టాల్సిందే. మన డబ్బులు మనమే తీసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాలం మారింది. అంతా డిజిటల్‌మయమైంది. జస్ట్ కూర్చున్నచోట నుంచి లక్షలకు లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎలాంటి బిల్లులైనా క్షణాల్లో చెల్లించొచ్చు. అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌తో ఎంత సౌకర్యం ఉందో… అంతే రిస్క్ కూడా ఉంది. ఒక్కోసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అసలు డబ్బులు ఎక్కడికి పోయాయో తెలియదు. బ్యాంక్ వాళ్లకి కాల్ చేస్తే సమాధానం ఉండదు. మరి ఇలాంటివాటిపై ఎవరిని అడగాలి? సంబంధిత సంస్థలు స్పందించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇప్పటివరకు చాలామందిలో ఉన్న అనుమానాలు ఇవి.

ఇప్పుడు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ డిజిటల్ లావాదేవీలు ఎంతలా జరుగుతున్నాయో.. ఇటువంటి సమస్యల పరిష్కారం కోసమే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రవేశపెట్టింది ఆర్బీఐ.

అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, 2019 జనవరి 31న అమలులోకి వచ్చేసింది. అమెజాన్ పే, పేటీఎం, మొబీక్విక్, ఫోన్‌పే… ఇలా ఎలాంటి సంస్థలైనా డిజిటల్ లావాదేవీల్లో ఏవైనా సేవా లోపాలు ఉంటే వాటిపై ఫిర్యాదులు చేయడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాంగమే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఈ ఫిర్యాదులన్నీ కేవలం ఆన్‌లైన్‌లో చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే పరిమితం.

మనం వ్యాలెట్‌లో ఫండ్స్‌ డిపాజిట్ చేసినప్పుడు నిర్ణీత సమయంలో డబ్బులు వ్యాలెట్‌లో కనిపించకపోయినా, నిర్ణీత సమయంలో రీఫండ్ చేయకపోయినా, రీఫండ్ చేసేందుకు నిరాకరించినా, లావాదేవీలను తిరస్కరించినా, రద్దు చేసినా కంప్లైంట్ ఇవ్వొచ్చు.

ఉదాహరణకు ఒక్కోసారి ఫోన్ పే యాప్ తో మన బంధువులకో, స్నేహితులకో డబ్బులు పంపినప్పుడు మన అకౌంట్‌లో డబ్బులు డిడక్ట్ అవుతాయి. కానీ ఆ డబ్బులు అవతలివారి అకౌంట్‌లోకి చేరవు. లావాదేవీ ఇంకా పెండింగ్‌లోనే చూపిస్తూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మరుసటిరోజు మన అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. కానీ అప్పటివరకూ మనకు టెన్షన్ తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కంప్లైంట్ ఇవ్వొచ్చు. అంటే మనం ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు అవతలివాళ్లకు చేరకపోతే అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు.

ఇలా కంప్లయింట్ చేయొచ్చు..
అవసరమైన వివరాలతో నిర్ణీత ఫార్మాట్‌లో కంప్లైంట్ కాపీ ఫిల్ చేసి, మన సంతకంతో ఫిర్యాదు చేయాలి. ఎలక్ట్రానిక్ రూపంలోనూ మన కంప్లైంట్ పంపొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో ఉంటారు. చీఫ్ జనరల్ మేనేజర్ లేదా జనరల్ మేనేజర్ అంబుడ్స్‌మన్ వ్యవస్థను చూసుకుంటారు. మన కంప్లైంట్ వారికే వెళ్తుంది. కంప్లైంట్ ఇవ్వడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.

Comments

comments

Share this post

scroll to top